https://oktelugu.com/

తమన్ ప్రోమో అదిరింది.. త్రివిక్రమ్ ఐడియా హైలైట్ !

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు విదేశాల్లో షోలు చేయడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా వస్తోన్న ఆనవాయితీ. ఇప్పటికే మణిశర్మ, దేవీశ్రీప్రసాద్ లాంటి వారి షోస్ కి అక్కడ ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. అలాగే ప్రజెంట్ మ్యూజిక్ సంచలనం తమన్ కూడా గతంలో రెండు మూడు మ్యూజిక్ షోలు చేశాడు. కానీ ఇప్పుడు తమన్ చేస్తోన్న షో మాత్రం వెరీ స్పెషల్. కరోనా మహమ్మారి కారణంగా ఈవెంట్లు అన్ని మరుగున పడిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ మొదలైన తొలి […]

Written By:
  • admin
  • , Updated On : July 5, 2021 / 11:59 AM IST
    Follow us on

    స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు విదేశాల్లో షోలు చేయడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా వస్తోన్న ఆనవాయితీ. ఇప్పటికే మణిశర్మ, దేవీశ్రీప్రసాద్ లాంటి వారి షోస్ కి అక్కడ ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. అలాగే ప్రజెంట్ మ్యూజిక్ సంచలనం తమన్ కూడా గతంలో రెండు మూడు మ్యూజిక్ షోలు చేశాడు. కానీ ఇప్పుడు తమన్ చేస్తోన్న షో మాత్రం వెరీ స్పెషల్. కరోనా మహమ్మారి కారణంగా ఈవెంట్లు అన్ని మరుగున పడిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ మొదలైన తొలి మ్యూజిక్ షో ఇది.

    ఎలాగూ కరోనా రెండో దశ తర్వాత అమెరికాలో దాదాపు కరోనా ప్రభావం తగ్గిపోయింది కాబట్టి, అక్కడ భారీ షోలకు కూడా జనం బారులు తీరి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా కొనసాగుతున్న తమన్ అక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను హీరో అల్లు అర్జున్ రిలీజ్ చేయడం విశేషం.

    ఓ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ ప్రోమో వీడియో అదిరిపోయింది. అయితే ఈ ప్రోమో ఈ రేంజ్ లో రావడానికి కారణం త్రివిక్రమ్ అట. ఈ ప్రోమో కట్ కు బేసిక్ ఐడియా దగ్గర నుండి షాట్ మేకింగ్ వరకూ త్రివిక్రమ్ ఇన్ ఫుట్స్ మెయిన్ అని తెలుస్తోంది. ఇక డ్రమ్స్ వాయించడంలో నేటి మేటి శివమణి వాయింపు కూడా అదిరిపోయింది.

    అలాగే బ్యూటిఫుల్ సింగర్ హారిక మధ్యమధ్యలో వేసిన స్టెప్స్ కూడా ఈ ప్రోమోకి అదనపు గ్లామర్ ను అందించింది. అలాగే తమన్ తో పాటు మిగిలిన మ్యూజిక్ బృందం కూడా ఈ వీడియోలో హైలైట్ అయ్యారు. అమెరికాలోని వివిధ లోకేషన్లలో ఈ స్టేజ్ షో లు జరగబోతున్నాయని, అందుకు సంబంధిచిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయట.