
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఎంతో హాట్‌హాట్‌గా జరిగాయి. అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి. కానీ.. మరోసారి ఆ ఫలితాలు వైసీపీకి తిరుగులేదని నిరూపించాయి. ఈ ఎన్నికల్లో ఎంతో సత్తా చాటాలని చూసిన బీజేపీకి సైతం నిన్నటి రిజల్ట్స్ షాక్‌కు గురిచేశాయి. వన్‌సైడ్‌గా వెళితే ఎలా ఉంటుందో కమలం పార్టీకి తమ ఓటు ద్వారా చూపించారు ప్రజలు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ కనీస స్థానాలను కూడా సాధించుకోలేక పోయింది. అక్కడక్కడ వార్డులు గెలుచుకోవడం మినహా ఎక్కడా బలమైన పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ కంటే జనసేన పార్టీయే బెటరని ఈ ఫలితాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతోంది.
Also Read: బీజేపీకి ఇక జగన్ యే దిక్కా?
ఏపీలో బీజేపీ ఇక బలపడే సూచనలు లేవని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. నిజానికి బీజేపీకి ఉన్న బలమంతా అర్బన్ ప్రాంతాల్లోనే. అర్బన్ ప్రాంతాల్లో హిందుత్వ నినాదాన్ని అందుకోవడం, మోడీ ఇమేజ్ పనిచేయడం వంటి కారణాలతో మున్సిపల్ ఎన్నికల్లో కనీస పనితీరును మెరుగుపరుస్తామని బీజేపీ నేతలు భావించారు. కానీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే మాత్రం ఇక బీజేపీ దుకాణం బంద్ చేసుకోవడమే బెటర్ అని ప్రజలు తీర్పు చెప్పినట్లయింది.
ఏపీలో బీజేపీకి ముందు నుంచీ కష్టాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వరకూ అన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పనిచేశాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కనీసం రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని పట్టణ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడంలోనూ నాటకాలు తప్ప నిజానికి బీజేపీ చేసిందేమీ లేదన్నది ప్రజల్లో నాటుకుపోయింది.
Also Read: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశం ఎవరికంటే?
వీటికితోడు మరోవైపు పెరుగుతున్న పెట్రోలు ధరలు, నిత్యావసరాల ధరలు కూడా ఏపీ బీజేపీని దారుణంగా దెబ్బతీశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ బీజేపీకి శాపంగా పరిణమించాయని చెప్పాలి. ఇక తీర్థయాత్రలు, రథయాత్రలు మాని రాష్ట్ర బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై దృష్టి పెడితేనే భవిష‌్యత్ ఉంటుందనేది పలువురు సూచిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికపై కూడా పెద్దగా ఆశలు పెట్టుకోవడం కూడా వేస్ట్ అనే చెప్పాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్