https://oktelugu.com/

కమలం వైపే కాంగ్రెస్‌ క్యాడర్!

గ్రేటర్‌‌ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్‌ క్యాడర్‌‌ అంతా బీజేపీకి సపోర్ట్‌ చేసిన్లు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్‌‌ఎస్‌లో చేరడంతోనే ఆ పార్టీ డీలా పడిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా యాక్టివ్‌గా పనిచేయకపోవడంతో క్యాడర్‌‌ ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నది. ప్రభుత్వంపై ఎలాగూ ప్రజా వ్యతిరేకత ఉన్నది.. ఇది చీలిపోవద్దనే ఉద్దశంతో కమలానికి వైపు మళ్లినట్లు తెలుస్తోంది. Also Read: సర్వేలకు అందని గ్రేటర్‌‌ ఓటరు నాడి బీజేపీ దూకుడు ప్రచారం […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 5, 2020 / 12:11 PM IST
    Follow us on


    గ్రేటర్‌‌ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్‌ క్యాడర్‌‌ అంతా బీజేపీకి సపోర్ట్‌ చేసిన్లు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్‌‌ఎస్‌లో చేరడంతోనే ఆ పార్టీ డీలా పడిన విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా యాక్టివ్‌గా పనిచేయకపోవడంతో క్యాడర్‌‌ ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నది. ప్రభుత్వంపై ఎలాగూ ప్రజా వ్యతిరేకత ఉన్నది.. ఇది చీలిపోవద్దనే ఉద్దశంతో కమలానికి వైపు మళ్లినట్లు తెలుస్తోంది.

    Also Read: సర్వేలకు అందని గ్రేటర్‌‌ ఓటరు నాడి

    బీజేపీ దూకుడు ప్రచారం కూడా కారణమే..

    బీజేపీ నేతల దూకుడు ప్రచారం కూడా కాంగ్రెస్‌ క్యాడర్‌‌ను అటువైపు మళ్లేందుకు కారణమైంది. బండి సంజయ్‌ పాతబస్తీ మీద సర్జికల్‌ స్టైక్‌ చేస్తాం… రోహింగాలను తరిమేస్తాం అని చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని అట్రాక్ట్‌ చేశాయి. అంతేకాదు యూపీ సీఎం యోగీ, మహారాష్ట్ర మాజీ సీఎం పడ్నవిస్, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రచారం చేయించడం కూడా కలిసొచ్చింది. మీడియా సైతం బీజేపీని బాగా ఫోకస్‌ చేయడంతో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌ అన్నట్లు ప్రచారం సాగింది. అంతేకాదు మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ మేయర్‌‌ కార్తీకతో పాటు చాలామంద్రి సీనియర్‌‌ కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరారు. దీంతో క్యాడర్‌‌ కూడా ఇటువైపు మళ్లింది.

    Also Read: ఉత్తమ్‌ రిజైన్.. పీసీసీ ఎవరికి?

    కాంగ్రెస్‌ పెద్దలెక్కడ?

    కాంగ్రెస్‌కు తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్నా.. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ తరఫున ప్రచారం చేసేందు అగ్రనేతలంతా రంగంలోకి దిగితే… కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఒక్కరు కూడా కనిపించలేదు. రాహుల్, సోనియా సహా ఢిల్లీ నేతలతో కాదు రాష్ట్రంలోని సీనియర్‌‌ లీడర్లు కూడా పట్టించుకోలేదు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తప్ప.. మిగతావారెవరూ పెద్దగా ప్రచారం చేయలేదు. దీంతో జానాలు కాంగ్రెస్‌ను లైట్‌ తీసుకున్నారు. టీఆర్‌‌ఎస్‌తో ఢీఅంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ స్టాండ్‌ తీసుకున్నారు…

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్