https://oktelugu.com/

Pawan Kalyan- BJP: పవన్ కు బీజేపీ నో పర్మిషన్.. టెన్షన్ లో టీడీపీ, వైసీపీ?

Pawan Kalyan- BJP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పొత్తులపై ఎవరి ఎత్తులు వారికున్నాయి. దీంతో ఇదివరకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠగా చూస్తున్నాయి. బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీజేపీ ఆఫర్ పై అన్నిటి భవితవ్యం ఆదారపడి ఉందని […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 19, 2022 / 03:56 PM IST
    Follow us on

    Pawan Kalyan- BJP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పొత్తులపై ఎవరి ఎత్తులు వారికున్నాయి. దీంతో ఇదివరకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠగా చూస్తున్నాయి. బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీజేపీ ఆఫర్ పై అన్నిటి భవితవ్యం ఆదారపడి ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్ వ్యూహాల కోసం సిద్ధమవుతున్నాయి.

    Pawan Kalyan- BJP

    పవన్ కల్యాణ్ ఇప్పటికే బీజేపీకి అవకాశం ఇవ్వడంతో రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోందనే దానిపై ఆసక్తి పెరుగుతోంది. ఎన్నికల కోసమే అన్ని పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్న సందర్భంలో బీజేపీ వ్యూహమేంటో అనే దానిపై చర్చ జరుగుతోంది. రోడ్ మ్యాప్ తో బీజేపీ బలపడుతుందో లేదో తెలియదు కానీ పొత్తులపై ఓ అవగాహన వచ్చే అవకాశం ఏర్పడింది.

    Also Read:  మంత్రివర్గ విస్తరణపై మళ్లగుల్లాలు.. జగన్ మదిలో ఉన్నదెవరో?

    బీజేపీ పవన్ కల్యాణ్ పొత్తుపై స్పష్టత వస్తే ఇక వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై క్లారిటీ వచ్చే వీలుంటుంది. అందుకే బీజేపీ ఆఫర్ పై అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లే పవన్ కు బీజేపీ ఎలా మ్యాప్ ఇస్తుందో అనే దాని మీదే అందరి ఆశలు ముడిపడి ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు, జగన్ ఒంటరిగా బరిలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

    Pawan Kalyan

    టీడీపీకి మాత్రం బీజేపీ అవకాశం ఇచ్చేటట్లు లేదు. చంద్రబాబుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో టీడీపీతో పొత్తు ఉండదనే విషయం తెలుస్తోంది. మరోవైపు పవన్ బీజేపీలు దోస్తీ కడితే తమకు కంటగింపుగా ఉంటుందని వైసీపీ భావిస్తోంది. ఇక జగన్ పై ఉన్న కేసుల కారణంగా ఆయన బీజేపీతో వైరం కోసం ప్రయత్నం చేయరని తెలుస్తోంది. ఇంకా వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు ఇరుక్కోవడంతో జగన్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారింది. ఈ క్రమంలో బీజేపీ తీసుకునే నిర్ణయంపైనే మూడు పార్టీల భవితవ్యం ముడి పడి ఉందన్న విషయం అర్థమవుతోంది.

    Also Read: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులతో షాకిచ్చిన హ్యాకర్లు

    Tags