Ram Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ గొప్ప మనసు చాటుకున్నాడు. ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్ ఉక్రెయిన్ లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడికి షూటింగ్ నిమిత్తం వెళ్లిన రాంచరణ్ కు బాడీగార్డ్ గా రస్టీ అనే వ్యక్తి వ్యవహరించాడు. ఇప్పుడు అక్కడ యుద్ధంతో రస్టీ ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న హీరో రాంచరణ్ గొప్ప మనసు చాటుకున్నాడు. రస్టీకి తన వంతు సాయం చేశాడు.
ట్రిపుల్ ఆర్ సినిమా సందర్భంగా అక్కడే ‘నాటునాటు’ సాంగ్ తోపాటు చారిత్రక భవనాలు, ప్రకృతి సిద్ధ లోకేషన్లలో షూటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో తనకు బాడీగార్డ్ గా రక్షణ కల్పించిన రస్టీ గురించి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ రాంచరణ్ తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న తన బాడీగార్డ్ కుటుంబాన్ని ఆదుకొని గొప్ప మనసు చాటుకున్నాడు.
Also Read: మూవీ టికెట్ల విషయంలో కళ్లు తెరుచుకున్నారా..? అలాగే ఉంటుంది మరి..
రస్టీకి నిత్యావసర వస్తువులను, ఇతర సామగ్రిని కొనుగోలు చేయడానికి హైదరాబాద్ నుంచి డబ్బు పంపించారు. మీ కుటుంబం క్షేమంగా ఉందా? అని బాగోగులను రాంచరణ్ తెలుసుకున్నాడని రస్టీ చెప్పుకొచ్చాడు. ‘యుద్ధ సమయంలోనే రాంచరణ్ తనకు లేఖ రాశాడని.. నా కుటుంబం గురించి అడిగాడని.. ఏ సాయం కావాలన్నా చేస్తానన్నాడని…’ రస్టీ వివరించాడు.
అంతేకాదు.. రస్టీ భార్య కోసం రాంచరణ్ మందులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే రాంచరణ్ కు ట్విట్టర్ వేదికగా వీడియో రిలీజ్ చేసి రస్టీ కృతజ్ఞతలు తెలిపాడు. రాంచరణ్ మేలు మరిచిపోలేనని.. ప్రస్తుతం మా మాతృభూమిని కాపాడుకోవాలనుకుంటున్నామని తెలిపారు.
సినిమా షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లి వచ్చిన రాంచరణ్ అక్కడి వారితో ఏర్పరుచుకున్న అనుబంధం.. తన బాడీగార్డ్ కు సాయం చేసిన వైనంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
#RamCharan has helped a security officer in Kyiv, Ukraine, who previously operated as his personal security member during #RRR’s shoot in Ukrainian.@AlwaysRamCharan 👏 pic.twitter.com/rRx8XuGowF
— Suresh Kondi (@SureshKondi_) March 18, 2022