https://oktelugu.com/

వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!

వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్లను యడ్యూరప్ప ప్రభుత్వం రద్దు చేసింది. ఆ మేరకు ప్రభుత్వ రెవెన్యూ శాఖ సౌత్-వెస్ట్రన్ రైల్వే శాఖ కి లేఖ ద్వారా తెలిపింది. వలస కార్మికుల తరలింపుకు సంబంధించి ఏర్పాటు చేసిన 10 రైళ్లను వెంటనే రద్దు చేయాలని లేఖలో వెల్లడించింది. 43 రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర సర్కార్ గ్రీన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 11:43 AM IST
    Follow us on

    వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్లను యడ్యూరప్ప ప్రభుత్వం రద్దు చేసింది. ఆ మేరకు ప్రభుత్వ రెవెన్యూ శాఖ సౌత్-వెస్ట్రన్ రైల్వే శాఖ కి లేఖ ద్వారా తెలిపింది. వలస కార్మికుల తరలింపుకు సంబంధించి ఏర్పాటు చేసిన 10 రైళ్లను వెంటనే రద్దు చేయాలని లేఖలో వెల్లడించింది.

    43 రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దింతో వివిధ రాష్ట్రా ప్రభుత్వాలు కార్మికులని తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. తాజాగా కర్ణాటక కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఈ రోజు ఆ రైళ్లను రద్దు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

    ముఖ్యమంత్రి యడ్యూరప్ప బిల్డర్లు, కాంట్రాక్టర్లతో సమావేశ అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నిర్మాణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి మాకు కార్మికులు అవసరమని బిల్డర్లు, కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో బీజేపీ ప్రభుత్వం ఆ మేరకు బీహార్ కి ఏర్పాటు చేసిన 10రైళ్లను రద్దు చేసింది. వలస కార్మికులు ఇప్పటికే మూడు రైళ్లలో తమ సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు.  ఇంకా 53,000 మంది వలస కార్మికులు బీహార్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు సంబంధించిన టికెట్స్ కూడా వారు బుక్ చేసుకొని ఉన్నారు. కానీ తాజా వార్తతో కూలీలు విస్మయానికి గురౌతున్నారు.