ఉద్యోగాలు పోతాయని 86 శాతం భారతీయుల భయం!

కరోనా మహమ్మారి కారణంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కుదేలు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం కనిపిస్తుండగా, 86 శాతం మంది భారతీయులలో అత్యధికంగా ఉన్న ఉద్యోగం పోతుందనే కలవరం వ్యక్తం అవుతున్నది. సిటీ గ్రూప్‌ భారత్‌ సహా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌ దేశాల్లో సర్వే చేపట్టింది. గత నెల 23-27 మధ్య జరిగిన సర్వేలో అత్యధికంగా 86% భారతీయులు తమ ఉద్యోగాలు, జీవనోపాధిపై ఆందోళన వ్యక్తం చేశారు. 71%తో హాంకాంగ్‌ రెండో […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 12:26 pm
Follow us on


కరోనా మహమ్మారి కారణంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కుదేలు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం కనిపిస్తుండగా, 86 శాతం మంది భారతీయులలో అత్యధికంగా ఉన్న ఉద్యోగం పోతుందనే కలవరం వ్యక్తం అవుతున్నది.

సిటీ గ్రూప్‌ భారత్‌ సహా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌ దేశాల్లో సర్వే చేపట్టింది. గత నెల 23-27 మధ్య జరిగిన సర్వేలో అత్యధికంగా 86% భారతీయులు తమ ఉద్యోగాలు, జీవనోపాధిపై ఆందోళన వ్యక్తం చేశారు. 71%తో హాంకాంగ్‌ రెండో స్థానంలో ఉండగా, అమెరికా (41%), ఆస్ట్రేలియా (33%), బ్రిటన్‌ (31%)లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)

కాగా, కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు భారత దేశంలోని 84% మంది అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో అమెరికా 43%తో అట్టడుగు స్థానంలో ఉన్నది. బాగున్నాయని భారత్‌ తర్వాత ఆస్ట్రేలియా (71%), బ్రిటన్‌ (56%), హాంకాంగ్‌ (53%) దేశాలున్నాయి.

ఇక కరోనా నివారణకు అవలంభిస్తున్న చికిత్సా విధానం, వైద్య సదుపాయాలపై భారత్‌లో 68% మంది సంతృప్తిగా ఉన్నారు. బ్రిటన్‌లో ఇది మైనస్‌ 17%తో ఉండటం గమనార్హం. అమెరికాలో 3% మంది సంతృప్తికరంగా ఉంటే, ఆస్ట్రేలియాలో 60% మంది, హాంకాంగ్‌లో 22% మంది సంతృప్తిగా ఉన్నారు.

వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!

ఇదిలావుంటే ఇంకా కరోనా ఆరంభ దశలోనే ఉందని 84% మంది విశ్వసిస్తున్నారు. అంతేగాక ఈ వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నదని నమ్ముతున్నారు.

ముఖ్యంగా, తయారీ, మీడియా, ఐటీ రంగాల్లోని నిపుణుల్లో భవిష్యత్తుపై భరోసా లేదని లింక్డిన్‌ సర్వే వెల్లడించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉద్యోగ స్థిరత్వం, వృత్తిరిత్యా ప్రగతి అంశాల్లో విశ్వాసం సన్నగిల్లిందని పేర్కొన్నది. తయారీ రంగంలో ప్రతీ నలుగురిలో ఒకరికి, ఐటీ రంగంలో ప్రతీ ఐదుగురిలో దాదాపు ఇద్దరికి, మీడియా రంగంలో ఐదుగురిలో ముగ్గురికి తమ ఉద్యోగం, భవిష్యత్తుపై ఆందోళనలు కనిపిస్తున్నాయి.

లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లింపు వలసిందే అని భారత ప్రభుత్వం స్పష్టం చేసినా మూడోవంతుకు పైగా ప్రైవేట్ కంపెనీలు సుముఖంగా లేన్నట్లు తెలుస్తున్నది. పలు కంపెనీల్లో జీతాలు తగ్గించడం, లాక్ డౌన్ కారణంగా రాలేకపోయిన వారికి సెలవుగా పరిగణించడం, వచ్చే రెండేళ్ల వరకు జీతాల పెంపు, ప్రమోషన్లు లేవనే సంకేతాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది.