Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ చరిత్ర చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. స్వాతంత్ర్యానికి పూర్వం అన్ని రంగాల్లో వారి మాటే చెల్లే విధంగా ప్రవర్తించే వారు. అందుకే జనగనమన, వందేమాతరం జాతీయ గీతాలుగా చేసే వరకు కూడా వారు ఊరుకోలేదు. అంతటి పట్టు వారికి ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వారిలో కూడా పట్టు తప్పుతోంది. బెంగాల్ విభజనకు బీజేపీ పావులు కదుపుతోంది. గూర్ఖాలాండ్, నార్త్ బెంగాల్ అని రెండు భాగాలుగా విడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. కానీ దీదీ మాత్రం తన రక్తం చిందించైనా బెంగాల్ ను విభజించనీయను అని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో రాజకీయ చదరంగంలో ప్రస్తుతం ఏం మార్పులు వస్తాయో కూడా తెలియడం లేదు. కానీ బీజేపీ మాత్రం తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

దీదీ అయితే బెంగాల్ ను తన ప్రాణం పోయినా ముక్కలు కానివ్వనని కుండబద్దలు కొడుతోంది. ఈ మేరకు తన ప్రజలకు అన్యాయం జరగనివ్వనని చెబుతోంది. దీనిపై బీజేపీ కూడా కౌంటర్ ఇస్తోంది. బెంగాల్ అభివృద్ధి దృష్ట్యా విభజన తప్పదని సూచిస్తోంది. ఒక్క రాష్ర్టంగా మమతా బెనర్జీని ఎదుర్కోవడం కష్టంగానే ఉన్నందునే రెండుగా విడగొట్టాలని బీజేపీ చూస్తోందని దీదీ ఆరోపిస్తున్నారు. ఆమె ఆరోపణలు సత్యదూరమని బీజేపీ వాదిస్తోంది.
Also Read: Tollywood Actors Writers: హీరోలే రైటర్స్.. టాలీవుడ్ లో ఎవరెవరున్నారో తెలుసా?
అభివృద్ధి కోసమే రాష్ర్టాన్ని రెండుగా విభజించడం జరుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. గూర్ఖాలాండ్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని తెలిసిందే. కానీ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో రెండుగా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రెండు పార్టీల మధ్య బెంగాల్ విభజన కార్యరూపం దాలుస్తుందో మమతా బెనర్జీ భయంతో వాయిదా పడుతుందో తెలియడం లేదు. మొత్తానికి బెంగాల్ రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా మారింది.

2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రాజకీయం చేస్తోందని మమత మండిపడుతున్నారు. కానీ తాను బతికుండగా అది సాధ్యం కాదని చెబుతోంది. బీజేపీ చేస్తున్న కుతంత్రాలు ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించే ప్రసక్తే లేదని కొట్టి పారేస్తున్నారు. బీజేపీ కుట్రలకు లొంగేది లేదని చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెంగాల్ ఒక రాష్ర్టంగానే ఉంటుంది తప్ప రెండు భాగాలుగా విడిపోదని ఘంటాపథంగా దీమా వ్యక్తం చేస్తున్నారు.
గూర్ఖాలాండ్, నార్త్ బెంగాల్ అంటూ బీజేపీ నొక్కుతున్న సన్నాయినొక్కులు ఎవరికి అక్కర్లేదు. బీజేపీ విధానాలను అడ్డుకుని దాని కుటిల రాజనీతిని ఎండగడతామని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం భావనే తమకు కలగదని చెబుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ తన ప్రయత్నాలు మానుకుని రాష్ట్రాన్ని విడగొట్టే కుట్రలు చేయొద్దని సూచిస్తున్నారు.
Also Read:AP SSC Results: టెన్త్ పూర్ రిజల్ట్స్.. కొవిడ్ కారణం చెప్పి తప్పించుకున్న ప్రభుత్వం