https://oktelugu.com/

మార్షల్ ఆర్ట్స్ పై పవన్ ప్రేమ ఎంతంటే?

రాజకీయం అయినా సినిమా రంగమైనా పవన్ కళ్యాణ్ శ్రద్ధ పెట్టి పనిచేస్తారు. అందులోని గుట్టు మట్లను తెలుసుకుంటారు. సినిమాల్లో హీరోగా రావడానికి ముందే నటనలో, కరాటేలో డ్యాన్సులలో పవన్ శిక్షణ తీసుకున్నాడు. ఆయన చిత్తశుద్దికి ఇది నిదర్శనం. ఈ క్రమంలోనే ఏదైనా అరుదైన కళతో రాణించే వారిని అభినందించడంలో ఆర్థిక సాయం చేయడంలో పవన్ ముందుంటాడు. ఇలా ఎంతో మందికి పవన్ సేవ చేశాడు కూడా.. తాజాగా అరుదైన యుద్ధ కళ ‘వింగ్ చున్ మార్షల్ ఆర్ట్స్’లో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 26, 2021 / 08:22 PM IST
    Follow us on

    రాజకీయం అయినా సినిమా రంగమైనా పవన్ కళ్యాణ్ శ్రద్ధ పెట్టి పనిచేస్తారు. అందులోని గుట్టు మట్లను తెలుసుకుంటారు. సినిమాల్లో హీరోగా రావడానికి ముందే నటనలో, కరాటేలో డ్యాన్సులలో పవన్ శిక్షణ తీసుకున్నాడు. ఆయన చిత్తశుద్దికి ఇది నిదర్శనం.

    ఈ క్రమంలోనే ఏదైనా అరుదైన కళతో రాణించే వారిని అభినందించడంలో ఆర్థిక సాయం చేయడంలో పవన్ ముందుంటాడు. ఇలా ఎంతో మందికి పవన్ సేవ చేశాడు కూడా..

    తాజాగా అరుదైన యుద్ధ కళ ‘వింగ్ చున్ మార్షల్ ఆర్ట్స్’లో ప్రావీణ్యుడు అయిన ప్రభాకర్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్కరించాడు. విదేశాల్లో పుష్కలమైన అవకాశాలున్నప్పటికీ నెల్లూరు యువతకు యుద్ధ విద్య నేర్పిస్తూ ఇక్కడే ఉండటం అభినందనీయమని జనసేనాని ప్రశంసించాడు.

    ప్రభాకర్ రెడ్డి సూచనలతో పవన్ కళ్యాణ్ కాసేపు ‘వింగ్ చున్ మార్షల్ ఆర్స్’ సాధన చేశాడు. ఇదివరకే పవన్ కరాటే నేర్చుకున్నాడు. దీంతో ఈ కొత్త విద్యపై ఆసక్తి కనబరిచాడు.