https://oktelugu.com/

ఇంటర్ సాఫ్ట్ వేర్ జాబ్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

మనలో చాలామంది చిన్నప్పటి నుంచే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటారు. అలా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు హెచ్.సీ.ఎల్ కంపెనీ శుభవార్త చెప్పింది. ఇంటర్ చదువుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే అవకాశం కల్పించింది. తాజాగా హెచ్.సీ.ఎల్ కంపెనీ నుంచి టెక్ బీ అర్లీ కెరియర్ ప్రోగ్రాం పేరుతో ఒక ప్రకటన వెలువడగా ఆన్ లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 25, 2021 / 11:27 AM IST
    Follow us on

    మనలో చాలామంది చిన్నప్పటి నుంచే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలని కలలు కంటూ ఉంటారు. అలా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలని భావించే వాళ్లకు హెచ్.సీ.ఎల్ కంపెనీ శుభవార్త చెప్పింది. ఇంటర్ చదువుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే అవకాశం కల్పించింది. తాజాగా హెచ్.సీ.ఎల్ కంపెనీ నుంచి టెక్ బీ అర్లీ కెరియర్ ప్రోగ్రాం పేరుతో ఒక ప్రకటన వెలువడగా ఆన్ లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    Also Read: ఎన్టీపీసీలో 230 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వాళ్లు మాత్రమే అర్హులు..?

    ఎంపికైన వాళ్లను ఏడాది శిక్షణ తరువాత ఎంట్రీ లెవెల్ ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు ప్రముఖ సంస్థల నుంచి డిగ్రీ చేసే అవకాశం కూడా ఉంటుంది. టెక్ బీతో ఇంటర్ తోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావాలనే కలను నెరవేర్చుకోవడంతో పాటు చిన్న వయస్సులోనే ఉద్యోగం పొంది కెరీర్ లో సక్సెస్ కావచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కంపెనీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 257 ఉద్యోగాలు..?

    6 నుంచి 9 నెలల పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్, 3 నుంచి 6 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ సమయంలో ఉద్యోగికి ప్రతి నెలా 10 వేల రూపాయలు వేతనంగా లభిస్తుంది. శిక్షణ పూర్తైన తర్వాత హెచ్.సీ.ఎల్ కంపెనీలో ఫుల్ టైం ఎంప్లాయ్ గా చేరి ఐటీ సర్వీస్ ఉద్యోగాల కోసం 2 లక్షల రూపాయల నుంచి రూ.2.5 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. అసోసియేట్లకు రూ.1.7 లక్షల వేతనం లభిస్తుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    అయితే ఈ ఉద్యోగాలకు శిక్షణకు ఎంపికైన వాళ్లు 2 లక్షలు + ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అసోసియేట్ ఉద్యోగాలకు లక్ష రూపాయలు + ట్యాక్స్ చెల్లించాలి. శిక్షణలో ప్రతిభ చూపిన వారికి ఫీజు మొత్తం వెనక్కు వస్తుంది. ఇంటర్ లో కనీసం 75 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఐటీ సర్వీస్ విభాగానికి, 65 శాతం మార్కులతో పాసైన వాళ్లు అసోసియేట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.