https://oktelugu.com/

BJP Navakumar: బీజేపీకి వాయిస్ గా మారిన ‘నవ కుమార్’

-బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా అధికార ప్రతినిధిగా అంబటి నవకుమార్ నియామకం BJP Navakumar: ఏపీ బీజేపీ వాయిస్ రేజ్ చేసే టైం వచ్చింది. తమ వాణి గట్టిగా వినిపించే నేతల కోసం శూలశోధన చేసిన ఆ పార్టీ చివరకు నేతలను కనుగొన్నది. వారికి తాజాగా బాధ్యతలూ అప్పగించింది. ఏపీ బీజేపీలో సోము వీర్రాజు, విష్ణు, పురంధేశ్వరి సహా ఎంతో మంది వాగ్ధాటి గల నేతలున్నారు. ఇప్పుడు వారి వరుసలోనే ఏపీలో అధికార ప్రతినిధిగా మరో కీలక నేతకు అవకాశం […]

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2022 / 04:01 PM IST
    Follow us on

    -బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా అధికార ప్రతినిధిగా అంబటి నవకుమార్ నియామకం

    BJP Navakumar: ఏపీ బీజేపీ వాయిస్ రేజ్ చేసే టైం వచ్చింది. తమ వాణి గట్టిగా వినిపించే నేతల కోసం శూలశోధన చేసిన ఆ పార్టీ చివరకు నేతలను కనుగొన్నది. వారికి తాజాగా బాధ్యతలూ అప్పగించింది. ఏపీ బీజేపీలో సోము వీర్రాజు, విష్ణు, పురంధేశ్వరి సహా ఎంతో మంది వాగ్ధాటి గల నేతలున్నారు. ఇప్పుడు వారి వరుసలోనే ఏపీలో అధికార ప్రతినిధిగా మరో కీలక నేతకు అవకాశం దక్కింది.

    Navakumar

    బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా అధికార ప్రతినిధిగా అంబటి నవకుమార్ ను…బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు నియమించారు… అంబటి నవకుమార్ మంచి వాగ్దాటి, తన విశ్లేషణతో ప్రధానిమోడీ ,బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా మీడియా ద్వారా తీసుకువెళ్తారని సోమూవీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు…

    Also Read: Taapsee Pannu: తాప్సీ క్లారిటీ ఇచ్చింది.. కానీ ఉపయోగం ఏముంది ?

    అంబటి నవకుమార్ మాట్లాడుతూ…నాపై నమ్మకంతో అధికార ప్రతినిధిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమూవీర్రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు పార్టీకి అన్ని విధాలుగా పనిచేసి…అందరిని కలుపుకుంటూ…పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు….
    మీడియా ప్యానల్ లో ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

    ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా నవకుమార్ ఇప్పుడు మీడియాల్లో బీజేపీ వాణి వినిపించనున్నారు. వివిధ చానెల్స్ చర్చా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోనున్నారు. విలేకరుల సమావేశాల్లోనూ బీజేపీ తరుఫున మాట్లాడనున్నారు. ఈ కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీకి ఈ సందర్భంగా నవకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

    Also Read: Hero Surya:పేదలకు ఉచితంగా ఇల్లులు కట్టించిన హీరో సూర్య

    Recommended Videos