Telugu Actor : ఆ రోజుల్లో.. అనగా అరవై సంవత్సరాల క్రితం సినిమా హీరో అవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందం, ప్రతిభ ఉన్నా అప్పటి కాలంలో వెండితెర కథానాయకుడిగా రాణించలేని పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితుల్లో కూడా అదృష్టం కలిసి వచ్చి.. ఓ కుర్రాడు చాలా సులభంగా హీరో అయ్యాడు. పైగా అతి వేగంగా స్టార్ గా ఎదిగాడు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి హీరో తానే అని పేరు తెచ్చుకున్నాడు. నిర్మాతల అతని వెంట పడటం మొదలుపెట్టారు. తెలుగు లోగిళ్లలో అతన్ని ఆరాధించడం ప్రారంభం అయింది. అతనే అలనాటి అందాల హీరో హరినాథ్ గారు.
కాకపోతే జీవితంలో ఎదిగే సమయంలో ఆయన విలాసాల బాట పట్టారు. నటనను నిర్లక్ష్యం చేశారు. చుట్టూ అమ్మాయిలు, చేతిలో మత్తు పానీయాలు.. నిత్యం ఆయన ఆ సరదాలతోనే గడుపుతూ వచ్చారు. తెలియకుండానే ఆ మత్తులో కాలం వృధా అయిపోయింది. ఆలోచించే లోపే ఆయన సినీ జీవితం అస్తవ్యస్తమైపోయింది.
హరినాథ్ పరిస్థితి గమనించి ఎన్టీఆర్ పిలిచి మందలించారు. చేసే వృత్తిని ప్రేమిస్తేనే.. ఆ వృత్తి మనకు గౌరవాన్ని ఇస్తోంది అంటూ హరనాథ్ కి నచ్చచెప్పారు. పైగా ఎన్టీఆర్ తాను దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’లో శ్రీరాముడి పాత్రను హరినాథ్ కి ఇచ్చారు. దాంతో హరినాథ్ క్రేజ్ మరింతగా పెరిగింది. దాంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు.
ఎన్టీఆర్ తర్వాత స్థానం హరనాథ్ దే అనే పేరు కూడా బాగా స్థిరపడిపోయింది. ఈ క్రమంలోనే హీరోయిన్లు హరనాథ్ ను బాగా ఇష్టపడేవారు. భవిష్యత్తులో తెలుగు చిత్రసీమను శాసించే హీరో అనుకుని.. అతనితో హీరోయిన్లందరూ సన్నిహితంగా ఉండేవారు. ఇక్కడే హరనాథ్ గారి ఫోకస్ తప్పింది. నటన పై, సినిమాల పై ఏకాగ్రత కూడా తప్పింది.
తెలుగు తెర పై హరనాథ్ స్వర్ణయుగం నడుస్తున్న కాలంలో మత్తుకు మరింతగా అలవాటు పడిపోయారు. దీనికితోడు ఎస్వీయార్, హరనాథ్ ల స్నేహం కూడా పెరిగింది. ఇద్దరు డిమాండ్ ఉన్న గొప్ప నటులే. అయితే, వాళ్లు నటనలో పోటీ పడకుండా వ్యసనాల్లో పోటీ పడ్డారు. దాంతో హరనాథ్ కు అవకాశాలు తగ్గాయి, ప్రేక్షక ఆదరణ తగ్గింది.
Also Read: Daggubati Rana: ఓ వెబ్ సైట్ పై ఫైర్ అయిన హీరో రానా… నీ సోది అంటూ పోస్ట్
తూర్పు గోదావరి జిల్లా రాపర్తిలో 1936లో సెప్టెంబర్ 2 జన్మించారు హరనాథ్. ఆయన పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాధ రాజు. ఎంతో గొప్పగా ఎదిగి.. చివరకు సంపాదించింది పోగొట్టుకుని బతకడానికి కూడా ఇబ్బంది పడ్డారు. చివరి రోజుల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. నిజానికి హరనాథ్ వ్యసనాల నుండి బయట పడలేక పోవడానికి కారణం.. ఎస్వీయార్ స్నేహమే అని అతి కొంతమందికి మాత్రమే తెలుసు. ఏది ఏమైనా హరినాథ్ జీవితం కథానాయకులకు ఓ పాఠం.
Also Read: Acharya Songs: Neelambari song lyrics Telugu and English, నీలాంబరి సాంగ్ లిరిక్స్
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Telugu actor haranath real life story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com