https://oktelugu.com/

పోయేకాలం వచ్చిదంటే ఇదే కాబోలు..!

కుక్కపిల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల.. కవితకు కాదేదీ అనర్హం అని ఓ మహానుభావుడు చెప్పాడు. అయితే దీనికి కొందరు కల్తీనాయుళ్లు విపరీతార్థాలు చెబుతున్నారు. కల్తీకి కూడా కాదేదీ అనర్హం అంటూ కొత్త భాష్యాన్ని చెబుతున్నారు. పాలు, పండ్లు, బియ్యం, పప్పు, ఉప్పు, నూనె ఇలా ఏ వస్తువు తీసుకున్న నకిలీ వస్తువులే కన్పిస్తున్నాయి. ఇప్పటికే కల్తీ వస్తువులు మార్కెట్లోకి విచ్చలవిడిగా రావడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. వస్తువుల నాణ్యతపై అధికారులు అప్పుడప్పుడు తూతుమంత్రంగా తనిఖీలు చేపడుతూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 8:30 pm
    Follow us on


    కుక్కపిల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల.. కవితకు కాదేదీ అనర్హం అని ఓ మహానుభావుడు చెప్పాడు. అయితే దీనికి కొందరు కల్తీనాయుళ్లు విపరీతార్థాలు చెబుతున్నారు. కల్తీకి కూడా కాదేదీ అనర్హం అంటూ కొత్త భాష్యాన్ని చెబుతున్నారు. పాలు, పండ్లు, బియ్యం, పప్పు, ఉప్పు, నూనె ఇలా ఏ వస్తువు తీసుకున్న నకిలీ వస్తువులే కన్పిస్తున్నాయి. ఇప్పటికే కల్తీ వస్తువులు మార్కెట్లోకి విచ్చలవిడిగా రావడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. వస్తువుల నాణ్యతపై అధికారులు అప్పుడప్పుడు తూతుమంత్రంగా తనిఖీలు చేపడుతూ చేతులు దులుపుకుంటుండటంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు.

    Also Read: కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?

    ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు శాయశక్తుల పోరాడుతున్నారు. ఇలాంటి సమయాన్ని కూడా కల్తీరాయుళ్లు కాసుల కక్కుర్తికి పాటుపడుతూ ప్రజల ప్రాణాలను రిస్కులో పెడుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ కొనుగోనేందుకు సైంటిస్టులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మనదేశంలో కరోనా డ్రగ్, ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. గ్లెన్ మార్క్ సంస్థ కరోనాకు ట్యాబెట్ ను తీసుకురాగా హెటిరో సంస్థ కరోనా ఇంజెక్షన్లను తీసుకొచ్చింది.

    అయితే దీనిని కొందరు కల్తీరాయుళ్లు తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. కరోనా ఇంజెక్షన్ల పేరిట నకిలీ ఇంజెక్షన్లను తయారుచేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ వ్యవహారమంతా కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది. తాజాగా ఇలాంటి వ్యవహారం గుజరాత్లో వెలుగుచూసింది. కల్తీ కరోనా ఇంజెక్షన్ల వ్యవహారంపై పుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సమాచారం అందడంతో వారంతా ఓ నకిలీ ఫార్మా కంపెనీపై చేసిన రైడ్‌ చేసి ఆ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ ముఠాలోని మొత్తం ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

    Also Read: ఉత్తరాంధ్ర జిల్లాలపై జగన్ ఫోకస్..

    కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజాప్రతినిధులు అండదండలతోనే ఇలాంటి కల్తీ పనులకు కొందరు పాల్పడుతున్నారని ఆరోపణలు విన్పిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇలాంటి ఘటనపై కఠినంగా వ్యవహరించి తొలినాళ్లలోనే వీటిపై ఉక్కుపాదం మోపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహరాన్ని చూసిన వారంతా పోయేకాలం అంటే ఇదేకాబోలు అని పలువురు పెదవి విరుస్తుండటం గమనార్హం.