లోన్ తీసుకునే వారికి అలర్ట్.. వెలుగులోకి సరికొత్త మోసాలు..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోని పోస్టుల ద్వారా చాలామంది మోసపోతున్నారు. నిమిషంలో లోన్ పొందవచ్చని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అమాయక ప్రజలను మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లోన్ ఇస్తామని.. లోన్ కావాలంటే ఆధార్, పాన్‌ కార్డు, ఒక చెక్కు, 2 ఫొటోలు ఆన్ లైన్ లో చెప్పిన మొబైల్ నంబర్ కు లేదా మెయిల్ ద్వారా పంపాలని సూచిస్తున్నారు. Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. […]

Written By: Navya, Updated On : February 20, 2021 1:35 pm
Follow us on

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోని పోస్టుల ద్వారా చాలామంది మోసపోతున్నారు. నిమిషంలో లోన్ పొందవచ్చని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అమాయక ప్రజలను మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లోన్ ఇస్తామని.. లోన్ కావాలంటే ఆధార్, పాన్‌ కార్డు, ఒక చెక్కు, 2 ఫొటోలు ఆన్ లైన్ లో చెప్పిన మొబైల్ నంబర్ కు లేదా మెయిల్ ద్వారా పంపాలని సూచిస్తున్నారు.

Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.411తో రూ.43 లక్షలు ..?

అన్నీ అప్ లోడ్ చేసిన తరువాత 3,500 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలని.. కంపెనీ నియమనిబంధనల ప్రకారం ముందుగానే ఆ మొత్తం చెల్లించాలని సైబర్ మోసగాళ్లు చెబుతున్నారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తరువాత బ్యాంక్ ఖాతాకు లోన్ మొత్తం జమ చేస్తామని చెప్పి సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో అమాయకులు ఈ తరహా మోసాల బారిన పడి మోసపోతున్నారు.

మరి కొంతమంది సైబర్ మోసగాళ్లు ప్రముఖ కంపెనీల పేర్లతో ఈ తరహా మోసాలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజును జమ చేసిన తరువాత ఫోన్ స్విఛాఫ్ చేస్తూ అమాయకులు నష్టపోయేలా చేస్తున్నారు. ఆన్‌లైన్‌ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో అమాయకపు ప్రజలను మోసం చేస్తూ ఉండటం గమనార్హం. సైబర్‌ క్రైమ్‌ అధికారులు ప్రజలు ఆన్ లైన్ మోసాలపై అవగాహన ఏర్పరచుకోవాలని సూచనలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

లక్షల్లో అప్పులిస్తామని ఆశ చూపి సైబర్ మోసగాళ్లు అమాయకపు ప్రజలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలు లోన్ ప్రకటనల విషయంలో ఏ మాత్రం రిస్క్‌ తీసుకున్నా మోసపోయే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.