https://oktelugu.com/

రజనీ కాంత్ పార్టీ ప్రకటన మరింత ఆలస్యం కానుందా?

సినిమా వాళ్లకు బోలెడన్నీ సెంటిమెంట్లు ఉంటాయని అందరికీ తెల్సిందే. బడా స్టార్ల నుంచి మొదలుకొని చిన్న స్టార్స్ కూడా ఏదో ఒక సెంటిమెంట్ ను ఫాలోవుతూనే ఉంటారు. సినిమా వాళ్లకు తోడుగా రాజకీయ నాయకులు సైతం సెంటిమెంట్లను ఫాలో అవడంలో ముందుంటారు. Also Read: న్యాయవ్యవస్థను కాపాడుతా.. జగన్ సర్కార్ పై జస్టిస్ రాకేష్ కుమార్ హాట్ కామెంట్స్ రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి నామినేషన్లు వేయడం.. ప్రమాణ స్వీకారం  లాంటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 22, 2020 / 11:48 AM IST
    Follow us on


    సినిమా వాళ్లకు బోలెడన్నీ సెంటిమెంట్లు ఉంటాయని అందరికీ తెల్సిందే. బడా స్టార్ల నుంచి మొదలుకొని చిన్న స్టార్స్ కూడా ఏదో ఒక సెంటిమెంట్ ను ఫాలోవుతూనే ఉంటారు. సినిమా వాళ్లకు తోడుగా రాజకీయ నాయకులు సైతం సెంటిమెంట్లను ఫాలో అవడంలో ముందుంటారు.

    Also Read: న్యాయవ్యవస్థను కాపాడుతా.. జగన్ సర్కార్ పై జస్టిస్ రాకేష్ కుమార్ హాట్ కామెంట్స్

    రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి నామినేషన్లు వేయడం.. ప్రమాణ స్వీకారం  లాంటి వాటిని కూడా ముహుర్తాలు చేసుకొని చేస్తుంటారు. మరీ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారు ఇంకెన్నీ సెంటిమెంట్లను ఫాలో అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలోనూ ఇలాంటి సెంటిమెంటే నడుస్తోంది. కొన్నేళ్లుగా రాజకీయ ఎంట్రీని ఎటూ తేల్చకుండా సస్పెన్స్ లో ఉంచిన రజనీకాంత్ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన.. కార్యచరణ ప్రకటించబోతున్నట్లు చెప్పారు.దీంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

    Also Read: టీడీపీ రెచ్చగొట్టే రాజకీయాలు.. ఉచ్చులో పడని వైసీపీ

    న్యూయర్ కు ముందే రజనీకాంత్ పార్టీ ప్రకటన వస్తుందని ఆశించిన అభిమానులకు కొత్త షాక్ తగిలేలా ఉంది. తమిళనాడులో అతిపెద్ద పండుగైన సంక్రాంతి రోజునే రజనీకాంత్ పార్టీ ప్రకటన ఉండనుందని తాజాగా ప్రచారం జరుగుతోంది.

    ఆరోజునే రజనీకాంత్ పార్టీ గుర్తు.. పార్టీ ప్రకటన. సిద్ధాంతాలను వెల్లడించనున్నారట. కాగా రజినీ కాంత్ పార్టీ పేరు మక్కల్ సేవై కర్చి అని.. పార్టీ గుర్తు ఆటో అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వీటిని అభిమానులు నమ్మకవద్దని రజనీకాంత్ సామాజిక సేవా విభాగం రజనీ మక్కళ్ మండ్రం కోరింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్