Bill Gates Indian TV debut: బిల్‌గేట్స్.. పరిచయం అక్కరలేని పేరు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు. గతేడాది భారత్‌లో పర్యటించిన బిల్‌గేట్స్ చాయ్‌వాలాతో ఫొటోలు దిగి ఆశ్చర్యపర్చాడు. ఇక బిల్‌గేట్స్‌కు మన ఐటీ నిపుణులు అంటే ఎక్కువ ఇష్టం. భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న బిల్‌గేట్స్.. త్వరలో బుల్లితెరపై మెరవబోతున్నాడు. హిందీ టెలివిజన్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన ‘క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించే స్మృతి ఇరానీతో కలిసి మైక్రోసాఫ్ట్ సహ స్థాపకుడు బిల్ గేట్స్ కలిసి నటించబోతున్నారు.
సోషల్ మెస్సేజ్‌తో..
స్మృతి ఇరానీ, బిల్ గేట్స్ మధ్య సీరియల్‌లో జరగబోయే వీడియో కాల్ సన్నివేశం గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచే ఉద్దేశ్యంతో చిత్రీకరించబడింది. ఇది కేవలం కథానూబంధం కాదు, సమాజానికి ఉపయోగకరమైన సందేశం చేరవేయాలన్న ప్రయత్నం. బిల్ గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో ప్రజా ఆరోగ్య కార్యక్రమాలకు భిన్న మార్గాల్లో సహకరిస్తోంది. ఆయన సీరియల్‌లో భాగమవడం ఈ సామాజిక బాధ్యతల విస్తరణగా భావించవచ్చు. వినోదం అనే ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రజా ఆరోగ్యం వంటి కీలక అంశానికి సానుకూల దృష్టిని ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం.
Also Read: ట్రంప్ కొట్టిన దెబ్బను.. ఆస్ట్రేలియాతో సరిచేసిన లోకేష్!
సాధారణంగా బిజినెస్ లేదా టెక్నాలజీ రంగం వ్యక్తులు టీవీ సీరియల్స్‌లో కనిపించడం చాలా అరుదు. ఈ ప్రసారం తర్వాత క్యాంపెయిన్‌ల రూపంలో మరిన్ని సామాజిక అంశాలను టెలివిజన్ కంటెంట్‌లో అనుసంధానం చేసే అవకాశాలు పెరగవచ్చు. చిన్న తెరపై ఈ కొత్త మేళవింపు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా నిలవడం ఖాయం.