Nara Lokesh Australia Tour: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్( American President Donald Trump) పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. పన్నులు పెంచి ప్రపంచ దేశాలను కోలుకోలేని దెబ్బతీశారు. ఆ దేశానికి ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వస్తువుల పై భారీగా సుంకం పెంచి ప్రపంచంలో చాలా దేశాలను ఇబ్బంది పెట్టారు. అందులో బాధిత దేశంగా ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ పెంచిన సుంకాలతో మన దేశంపై పెద్ద ప్రభావమే పడుతోంది. ముఖ్యంగా ఆక్వారంగం కష్టాల్లో పడింది. రొయ్యల ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళనతో ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ చతురతతో వ్యవహరించారు. అమెరికా ద్వారా జరిగిన నష్టాన్ని ఆస్ట్రేలియాతో బత్తి చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ఇది నిజంగా ఏపీలోని ఆక్వారంగానికి ఉపశమనం కలిగించే విషయమే.
90 శాతం అగ్ర రాజ్యానికి..
అగ్రరాజ్యం అమెరికాకు ఏపీ నుంచి ఆక్వా ఉత్పత్తులు( Aqua products ) ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. మొత్తం 100% ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికాకే తరలిస్తుంటారు. అయితే ఆక్వాపై అమెరికాలో సుంకాలు పెంచడంతో.. ఏపీలో వాటికి సంబంధించిన ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఆక్వాతో పాటు పదిరకాల అనుబంధ రంగాలపై కూడా ఇది ప్రభావం చూపింది. ఒక్కసారిగా రొయ్యల ధరలు సైతం పతనం అయ్యాయి. వాస్తవానికి మన రొయ్యలు జపాన్, చైనా తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే అమెరికాకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై సుంకం విధించడంతో అక్కడ డోర్ క్లోజ్ చేసినట్లు అయింది. దీంతో దేశీయ మార్కెట్ రంగంపై ఏపీ ఆక్వా ఆధారపడాల్సి వచ్చింది. మరోవైపు జపాన్ తో పాటు చైనాకు పరిమిత స్థాయిలోనే ఎగుమతులు అవుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆస్ట్రేలియా ఏపీ ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు ముందుకు రావడం శుభ పరిణామం. దీని వెనుక మంత్రి నారా లోకేష్ కృషి ఉంది. ఆస్ట్రేలియా ఆక్వారంగా అధికారులు, ప్రతినిధులు తో సమావేశం అయిన లోకేష్ వారిని ఒప్పించగలిగారు.
ఆ ఒక్క కారణంతో..
వాస్తవానికి ఆస్ట్రేలియా( Australia) గతంలో భారత్ నుంచి రొయ్యలను దిగుమతి చేసుకునేది. అయితే వైట్ స్పాట్ వైరస్ రొయ్యలు కావడంతో భారత్ నుంచి దిగుమతులను రద్దు చేసుకుంది. అప్పటినుంచి మన రొయ్యలపై ఆస్ట్రేలియాలో నిషేధం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ ప్రతినిధులతో లోకేష్ సమావేశం అయ్యారు. ఏపీ ఆస్ట్రేలియా మధ్య ఆక్వా ఎగుమత్తుల అంశంపై వారితో చర్చించారు. ఏపీలో ఈ రంగం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. 2027 అక్టోబర్ 20 వరకు భారతీయ రొయ్యలను ఆస్ట్రేలియా దిగుమతి చేసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు అక్కడి ప్రతినిధులు ఆమోదం తెలిపిన డాక్యుమెంట్లను జతచేస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏ ఏ రకాల రొయ్యలు? ఎంత ధరకు దిగుమతి చేసుకుంటారు? అన్న వివరాలను ఆ పత్రాలలో ప్రస్తావించారు.
లోకేష్ ట్వీట్..
నారా లోకేష్ ( Nara Lokesh)ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.’ భారతదేశ నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతుల్లో ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది. గతంలో తెల్ల మచ్చ వైరస్ ఉన్న రొయ్యలను తొక్క తీయకుండా ఆస్ట్రేలియా దిగుమతి చేసుకోలేదు. కానీ ఇప్పుడు భారత్ నుంచి వచ్చే ఆ రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఈ విజయం వెనుక భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాల కృషి ఎంతో ఉంది. వారికి నా కృతజ్ఞతలు. ఒకే మార్కెట్ పై ఆధారపడకుండా.. కొత్త మార్కెట్లను ఓపెన్ చేయడం చాలా ముఖ్యం ‘ అన్నారు మంత్రి నారా లోకేష్. వాస్తవానికి ఆస్ట్రేలియాతో పాటు సౌదీ అరేబియాలో మన రొయ్యలకు గిరాకీ ఉంది. అయితే తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకారం తెలపడంతో సుమారు 8వేల కంటైనర్ల రొయ్యలను ఎగుమతి చేసే అవకాశం ఉంది. అమెరికాతో సమానమైన ధర లభిస్తుందని తెలుస్తోంది. మొత్తానికైతే ట్రంప్ కొట్టిన దెబ్బను ఆస్ట్రేలియాతో భర్తీ చేశారు మంత్రి నారా లోకేష్.
#Australia #InvestInAP
A long-standing hurdle for Indian seafood exporters has been Australia’s restrictions on unpeeled prawns due to white spot virus detection.Today, the first import approval for Indian prawns has been granted. Our deepest gratitude to the extensive work… pic.twitter.com/jH5wtCWf06
— Lokesh Nara (@naralokesh) October 21, 2025