Bihar Special incentive revision: వాళ్లనే నమ్ముకున్నాం.. మీరు తొలగిస్తే ఎలా.. బిహార్‌లో స్పెషల్ ఇన్‌సెంటివ్ రివిజన్‌పై వివాదం
మనకు మద్దతు ఇస్తున్నవారు.. మన వెన్నంటి ఉండేవారు.. మన గెలుపులో వారి ఆనందం చూసుకునేవారు మన వెంటే ఉండాలనుకుంటాం. రాజకీయ నాయకులు కోరుకునేది ఇదే. అందుకే కార్యకర్తలే మా బలం.. ఓటర్లే మా దేవుళ్లు అని తరచూ అందరినీ తృప్తిపరిచే డైలాగ్స్ చెబుతుంటారు. కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ మనుగడ సాధించలేదు. ఇక ఇప్పుడు కులాలు, మత రాజకీయాలు ప్రజస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఓటర్లను కులాలు, మతాల వారీగా విభజించి రాజకీయం చేస్తున్నారు నేతలు. తాజాగా బిహార్‌లో ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్రమంగా ఓటర్ల జాబితాల్లో చొరబడిన వారిని ఏరివేస్తోంది.
Also Read: డ్రైవర్లకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ జేబులో పెట్టుకుంటే మీరు బ్లాకులో పడ్డట్లే
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివన జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇన్‌సెంటివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ఇపుపడు చర్చనీయాంశమైంది. ఓటర్ల జాబితా శుద్ధీకరణ పేరుతో స్థానికుతరులు, పొరుగు దేశాలు, అసాంఘిక శక్తుల ఓటర్లను ఏరివేస్తోంది. 2003 తర్వాత బిహార్‌లో ఇది మొదటి సమగ్ర సవరణ. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేసి, ఓటర్ల పౌరసత్వాన్ని ధ్రువీకరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఈ ప్రక్రియను సమర్థిస్తూ, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డులను కూడా ఆమోదయోగ్యమైన పత్రాలుగా పరిగణించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.BiharNews ఈ సవరణ బిహార్‌తో ఆగదు.. అస్సాం, గుజరాత్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లో కూడా అమలు కానుంది.
అడ్డగోలుగా అనర్హులు..
బిహార్ ఓటర్ల జాబితాలో గుర్తించిన అక్రమాలు ఈ సవరణకు కారణమయ్యాయి. సుమారు 12.5 లక్షల మంది మృతుల పేర్లు, 17.5 లక్షల మంది వలస వెళ్లిన వారి పేర్లు, 5.5 లక్షల మంది రెండు చోట్ల ఓట్లు నమోదై ఉన్నాయి. మొత్తంగా 35 లక్షల అక్రమ ఓటర్లు, అంటే బిహార్ ఓటర్లలో 4 శాతం, జాబితాలో ఉన్నట్లు ఈసీ గుర్తించింది. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌కు చెందిన విదేశీయులు అక్రమంగా ఓటర్లుగా నమోదైనట్లు తేలింది, ముఖ్యంగా ముస్లిం ఆధిక్యం ఉన్న జిల్లాలు అయిన అరారియా, పూర్ణియా, కటియా, కిషన్‌గంజ్ వంటి బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో విదేశీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్న విపక్షాలు..
విపక్ష పార్టీలు (కాంగ్రెస్, ఆర్‌జేడీ, ఏఐఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్) ఎస్‌ఐఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సవరణ ద్వారా లక్షలాది ఓటర్లు, ముఖ్యంగా దళితులు, ముస్లిం, వలస కార్మికులు, పేదలు ఓటరు జాబితా నుంచి తొలగించబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 శాతం ఓట్ల తేడాతో విపక్షాలు అధికారం కోల్పోయాయి, ఈ 4 శాతం అక్రమ ఓటర్ల తొలగింపు వారి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 40 నియోజకవర్గాల్లో 3,500 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఫలితాలు, ఈ అక్రమ ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవని సూచిస్తున్నాయి.
సవరణపై సుప్రీం కోర్టు దృష్టి..
సుప్రీం కోర్టు ఓటరు జాబితా సవరణను సమర్థించినప్పటికీ, దాని సమయం, పౌరసత్వ ధృవీకరణ బాధ్యత ఎన్నికల సంఘానికి లేనందున హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని ప్రశ్నించింది. ఆధార్, రేషన్ కార్డు వంటి సులభంగా అందుబాటులో ఉండే పత్రాలను ఆమోదించాలని సూచించింది, ఎందుకంటే బిహార్‌లో అధిక పేదరికం, వలసల కారణంగా జనన ధృవీకరణ పత్రాలు చాలామంది వద్ద లేవు. విపక్షాలు ఈ ప్రక్రియను బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించినదని ఆరోపిస్తున్నాయి.
Also Read: భాషా వివాదం ఎవరి ప్రయోజనం కోసం? ప్రజలు అప్రమత్తం కావాలిసిన వేళ!
రాజకీయ ప్రభావం..
బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతం (అరారియా, పూర్ణియా, కటియా, కిషన్‌గంజ్) ముస్లిం మెజారిటీ జిల్లాలుగా ఉండి, బంగ్లాదేశ్ సరిహద్దుతో సామీప్యత కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతంలో అక్రమ వలసదారుల ఓటరు నమోదు విపక్షాలకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఎస్‌ఐఆర్ ద్వారా ఈ ఓటర్ల తొలగింపు విపక్షాల ఓటు బ్యాంకును బలహీనపరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియ అనవసరంగా లక్షలాది సామాన్య ఓటర్లను ఓటు హక్కు నుంచి వంచితం చేసే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.
