Covid-19 Vaccine: దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత రెండు రోజుల నుంచి లక్ష పైచిలుకు కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటికే 150 కోట్ల వ్యాక్సినేషన్లను పంపిణీ చేశారు. తాజాగా 15 నుంచి 18 ఏళ్ల లోపు యువతకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఓ వ్యక్తి ఏకంగా 11 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.

వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్లిన ప్రతిసారి అతను నకిలీ డాక్యుమెంట్లను హెల్త్ వర్కర్లకు అందజేశాడు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మదేవ్ మండల్ అనే 84 ఏళ్ల వృద్ధుడు మాధేపూర్ జిల్లాలోని పురైనీ గ్రామానికి చెందినవాడు.
స్థానికంగా ఉండే పీహెచ్‌సీల్లో అతను విడతల వారీగా 11 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాడు. టీకా తీసుకున్న ప్రతిసారి తాను మరింత ఆరోగ్యంగా ఉన్నానని, అందుకే ఎక్కువ సార్లు టీకా వేయించుకున్నట్లు అతను ఒప్పుకున్నాడు. విషయం తెలుసుకున్న పీహెచ్‌సీ సిబ్బంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
Also Read: Omicron: ఒమిక్రాన్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్?
గత ఏడాది ఫిబ్రవరి 13న బ్రహ్మదేవ్ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడు. మళ్లీ మార్చి 13వ తేదీన అదే పీహెచ్‌సీలో రెండో డోసు టీకా వేయించుకున్నాడు. మూడో డోసు టీకా కోసం అతను మరో పీహెచ్‌సీ ఎంచుకున్నాడు. మే 19న ఔరయ్ పీహెచ్‌సీలో మూడో డోసు టీకా వేయించుకున్నాడు. మళ్లీ జూన్ 16, జులై 24, ఆగస్టు 31, సెప్టెంబర్ 11, 22, 24 తేదీల్లో వేర్వేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టీకా డోసులు వేయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బ్రహ్మదేవ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Also Read: Modi: లాక్ డౌన్ దిశగా మోడీ అడుగులు?
Joker123.Net
Covid-19 Vaccine: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 డోసుల వ్యాక్సిన్ వేసుకున్న ముసలోడు.. తర్వాత ఏమైందంటే? – OK Telugu