https://oktelugu.com/

Sunita: ‘రామ్’పై మనసులోని మాటను బయటపెట్టిన సునీత..!

Sunita Wedding Memories: స్టార్ సింగర్ సునీత గతేడాది క్రితం రెండో వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో సునీత వీరపనేని రామ్ ను వివాహం చేసుకుంది. వీరికి వివాహాం జరిగి నేటితో ఏడాది అవుతోంది. మొదటి వివాహా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామ్ సునీత దంపతులు అభిమానుల కోసం ఓ స్పెషల్ వీడియోను తాజాగా పోస్టు చేశారు. ‘Journey Of Love Sunitha Ram’ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్పెషల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 9, 2022 / 05:09 PM IST
    Follow us on

    Sunita Wedding Memories: స్టార్ సింగర్ సునీత గతేడాది క్రితం రెండో వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో సునీత వీరపనేని రామ్ ను వివాహం చేసుకుంది. వీరికి వివాహాం జరిగి నేటితో ఏడాది అవుతోంది. మొదటి వివాహా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రామ్ సునీత దంపతులు అభిమానుల కోసం ఓ స్పెషల్ వీడియోను తాజాగా పోస్టు చేశారు.

    Sunitha

    ‘Journey Of Love Sunitha Ram’ పేరుతో రిలీజ్ చేసిన ఈ స్పెషల్ వీడియో దాదాపు 10నిమిషాల 15సెకన్ల నిడివితో ఉంది. ఇందులో తమ పెళ్లి ముచ్చట్లు, ఏడాది కాలంలో తన జీవితంలో జరిగిన అనుభూతులను వీరిద్దరు అందించారు. ఈ వీడియోలో సునీత వాళ్లమ్మ మాట్లాడుతూ.. ‘సునీత తన బరువు, బాధ్యతలను నెరవెరుస్తూ చిరునవ్వు, సహనంతో జీవితంలో ముందుకు వేస్తుందని.. ఆమె డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అని’ చెప్పుకొచ్చారు.

    ఇక సునీత తన భర్త రామ్ గురించి మాట్లాడుతూ ఆయన ముక్కుసూటి మనిషి అని, నిజాయితీ పరుడని చెప్పొచ్చు. రామ్ ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయ్ అంటూ కితాబు ఇచ్చింది. రామ్ తనకు ఎనిమిదేళ్లుగా తెలుసనని పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని చెప్పింది. ఈ వీడియోలో సునీత పిల్లలతోపాటు రామ్ బంధువులు సైతం ఈ జంటపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ వీడియో తిలకించిన ఫ్యాన్స్ సైతం సునిత, రామ్ దంపతులకు వెడ్డింగ్ విషెస్ చెబుతున్నారు.