https://oktelugu.com/

బీహార్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీలు దూరం!

అమ్మో కాంగ్రెస్ పార్టీనా.. దూరం దూరం అంటున్నారు ఇప్పుడు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ.. బీహార్ లో గెలిచే అవకాశమున్న ఆర్జేడీ పుట్టి ముంచింది కాంగ్రెస్ యేనన్న విశ్లేషణలు సాగుతున్న వేళ ఆ పార్టీకి దూరంగా జరగాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయట.. తాజాగా  ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే బీఎస్పీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 10:14 AM IST
    Follow us on

    అమ్మో కాంగ్రెస్ పార్టీనా.. దూరం దూరం అంటున్నారు ఇప్పుడు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ.. బీహార్ లో గెలిచే అవకాశమున్న ఆర్జేడీ పుట్టి ముంచింది కాంగ్రెస్ యేనన్న విశ్లేషణలు సాగుతున్న వేళ ఆ పార్టీకి దూరంగా జరగాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయట.. తాజాగా  ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే బీఎస్పీ తోని తెగదెంపులు చేసుకున్న అఖిలేష్ వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నా, చితక పార్టీలను కలపుకొని ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

    Also Read: కోహ్లీనే కుక్క అంటావా?.. కాంగ్రెస్ నేతపై రెచ్చిపోయిన నెటిజన్లు..!

    బీహార్ ఎన్నికల ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా మామూలుగా లేదు. పలు రాష్ట్రాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం బీజేపీ హవా సాగుతున్నందున ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు గెలిచేదెలా..? అంటూ వ్యూహాలు పన్నుతున్నారు. ముఖ్యంగా రోజురోజుకు కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీతో అంటకాగకపోవడమే మంచిదని భావిస్తున్నాయట.. కాంగ్రెస్ తో కలిస్తే ఓటమి ఖాయమన్న భయం పార్టీలను వెంటాడుతోందట..

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే వ్యతిరేక కూటమిగా ఏర్పడి  కాంగ్రెస్, ఆర్జేడీలు కలిసి పోటీ చేశాయి. ఆర్జేడీ కూటమిని కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతీసింది. కాంగ్రెస్ కు 70 స్థానాలు అప్పగించగా కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆర్జేడీ 70కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ కు ఇన్ని సీట్లు ఇవ్వకుండా మరికొన్ని స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసి ఉండే అధికారం దక్కేదని కొందరు అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అభిప్రాయపడుతున్నారు.

    Also Read: బీహార్‌లో ఎవరు సీఎం.. ఎవరు‌ డిప్యూటీ సీఎం?

    ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ తో కలిసి ఉన్న ఎస్పీ ఇక పొత్తు లేకుండా పోటీలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో సమాజ్ వాదీ పార్టీ బోల్తాపడింది. బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జరిగింది. దీంతో ఇక కాంగ్రెస్ తో కాకుండా లోకల్ పార్టీలను కలుపుకొని అసెంబ్లీ ఎన్నికల్లో దిగేందుకు అఖిలేష్ యత్నిస్తున్నట్లు సమాచారం.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం

    ఇప్పటి వరకు బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ తో కలిసి పోటీచేయాలనే భావన ప్రాంతీయ పార్టీల్లో ఉండేది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నందున కాంగ్రెస్ తో కాకుండా ఒంటరిగా వెళ్తే ప్రజలు ఆదరించే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. కాంగ్రెస్ తో వెళితే పుట్టి మునగడం ఖాయమంటున్నారు. అయితే అఖిలేశ్ ఈ నిర్ణయంపై కట్టుబడి ఉంటారా..? లేక ఎన్నికల సమయానికి మనసు మార్చుకుంటారా..? అనేది చూడాలి.