Chandrababu Arrest: చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు.దాదాపు 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తొలుత ఆయన ఏసీబీ కోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.

Written By: Dharma, Updated On : October 27, 2023 1:36 pm

Chandrababu Arrest

Follow us on

Chandrababu Arrest: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై టిడిపి శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. కానీ హైకోర్టులో ఊరట దక్కలేదు. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై.. విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తప్పుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఈనెల 30 కి వాయిదా పడింది. దీంతో టీడీపీ శ్రేణుల ఆశలు నీరుగారిపోయాయి. కేసు విచారణ ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేసు విచారణ సమయాన్ని నిర్దేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు.దాదాపు 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తొలుత ఆయన ఏసీబీ కోర్టులో బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కోర్టు నిరాకరించింది. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 19న హైకోర్టు విచారించింది. పిటీషన్ను వెకేషన్ బెంచ్ ముందుకు పంపి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ ముందుకు విచారణ వచ్చింది.చంద్రబాబు అనారోగ్య పరిస్థితులు, అందుకు సంబంధించి మెడికల్ రిపోర్టులను ఆయన తరుపు న్యాయవాదులు జత చేశారు. దీంతో తప్పనిసరిగా మధ్యంతర బెయిల్ లభిస్తుందని భావించారు. కానీ న్యాయమూర్తి కేసు విచారణ నుంచి తప్పుకోవడంతో.. మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది.

ఈరోజు హైకోర్టులో విచారణ ప్రారంభమవుతుందనగా నాట్ బిఫోర్ మీ అంటూ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు. ఈనెల 30 కి విచారణ వాయిదా పడింది. ఆరోజు ఏ బెంచ్ విచారణ జరపాలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. వెంటనే విచారణకు ఉన్న సాధ్యసాధ్యాలను పరిశీలించాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోరిన ఫలితం లేకపోయింది. ఈ లెక్కన చంద్రబాబు మరికొన్ని రోజులు పాటు జైల్లో ఉండాల్సిన అనివార్య పరిస్థితి కనిపిస్తోంది.

మరో రెండు రోజుల్లో హైకోర్టులో ఈ కేసు విచారణ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ బెంచ్ విచారణ జరుపుతుందో తేలనుంది. ఆ తరువాతే కేసులో వాదనలు ప్రారంభం కానున్నాయి. కోర్టు ఇరువర్గాల వాదనలు విననుంది. దీనిపై తీర్పు వెలువడే అవకాశాలు ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. ఈ లెక్కన చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై టిడిపి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.