వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్‌లో కుమ్ములాటలు వెలుగులోకి వచ్చాయి. సీఎం సీటు నాకంటే నాకు ఇవ్వాలంటూ ఒకరి తర్వాత పైరవీలు చేశారు. తర్వాతి పరిణామాలతో రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా కొనసాగారు. అప్పటికే తెలంగాణ ఉద్యమం ఎవ్వెత్తున నడుస్తుండడంతో కాంగ్రెస్ తప్పని పరిస్థితిలో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇటు తెలంగాణలో, అటు ఏపీలో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. ఇక ఈ తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయలేననుకున్నదో ఏమో అధిష్టానం. సీడబ్ల్యూసీలో ఈసారి ఒక్క తెలుగు నాయకుడికి చోటు ఇవ్వలేదు. సీడబ్ల్యూసీ చరిత్రలో తెలుగు నేతలకు చోటు దొరక్కపోవడం ఇదే తొలిసారి.
Also Read: రూ.12 కోట్లకు టోకరా..: నూతన్ నాయుడిపై మరో కేసు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. నేతల మధ్య సఖ్యత లోపించింది. ప్రతిపక్షంలో ఉండి కూడా పట్టు నిలుపుకులేకపోతోంది. అసలే ఇరు రాష్ట్రాల్లోనూ పార్టీ కష్టాల్లో ఉంటే.. ఇలాంటి సమయంలో జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ పునర్నియామకాలకు దిగింది.
సీడబ్ల్యూసీ పునర్‌వ్యవస్థీకరణలో ఎవరో ఒకరికి చోటు దొరక్కపోతుందా అని చర్చ సాగింది. పలువురు సీనియర్లు కూడా ఎంతో ఆశతో ఉండిపోయారు. కానీ.. సోనియా గాంధీ మాత్రం తెలుగు నేతలను పూర్తిగా దూరం పెట్టేశారు. అదేసమయంలో జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాంనబీ ఆజాద్‌ను కూడా తొలగించారు. ఇటీవల సోనియాకు వ్యతిరేకంగా లేఖాస్త్రాలు సంధించిన తర్వాత క్రమంగా పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గించారు. కీలక యూపీలో కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ప్రియాంక గాంధీని నియమించారు. ఆజాద్‌తోపాటు అంబికాసోనీ, మోతీలాల్ ఓరా, మల్లికార్జున ఖర్గే వంటి నేతలను కూడా అధిష్టానం పక్కన పెట్టింది.
Also Read: ఏపీలో మరో ‘విషపు’ లీకేజీ.. ఏమిటీ ఉపద్రవాలు?
ఏఐసీసీ నుంచి పలువురు సీనియర్లు కూడా పదవులు కోల్పోయారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఇప్పటివరకు ఉన్న కుంతియాను పక్కన పెట్టి.. కొత్తగా మణికం ఠాగూర్‌ను నియమించారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఊమెన్‌చాందీ కొనసాగుతారని ప్రకటించారు. ఇక వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుల జాబితాలో కూడా ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా ఛాన్స్ దొరకలేదు. ప్రత్యేక ఆహ్వానితుల్లో మాత్రం చింతా మోహన్, ఐఎన్‌టీయూసీ కోటాలో సంజీవరెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్‌లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.