https://oktelugu.com/

తల్లిదండ్రుల పై సుధీర్ బాబు ఎమోషనల్ ట్వీట్ !

హీరో సుధీర్ బాబుకు బలమైన సినీ నేపథ్యం ఉన్నా.. ఎప్పుడూ తన సినిమా అవకాశాలకు గాని, పెద్ద డైరెక్టర్ లతో సినిమాలను సెట్ చేసుకోవడానికి గాని సుధీర్ బాబు ప్రయత్నించలేదు. తనంతట తానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు, తన సినిమాలను తానే సెట్ చేసుకున్నాడు. తనకంటూ హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సిక్స్ ఫ్యాక్ తో స్టైలిష్ లుక్ లోకి మారిపోయి తనకంటూ కొంతమంది అభిమానులను సంపాధించుకున్నాడు. అందుకే సుధీర్ బాబు తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు […]

Written By:
  • admin
  • , Updated On : September 12, 2020 / 12:49 PM IST
    Follow us on


    హీరో సుధీర్ బాబుకు బలమైన సినీ నేపథ్యం ఉన్నా.. ఎప్పుడూ తన సినిమా అవకాశాలకు గాని, పెద్ద డైరెక్టర్ లతో సినిమాలను సెట్ చేసుకోవడానికి గాని సుధీర్ బాబు ప్రయత్నించలేదు. తనంతట తానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు, తన సినిమాలను తానే సెట్ చేసుకున్నాడు. తనకంటూ హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సిక్స్ ఫ్యాక్ తో స్టైలిష్ లుక్ లోకి మారిపోయి తనకంటూ కొంతమంది అభిమానులను సంపాధించుకున్నాడు. అందుకే సుధీర్ బాబు తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు సాధించిన విజయానికి పుత్రోత్సాహం పొందుతున్నారు. నిజానికి సుధీర్ బాబు సినిమాల్లోకి రావడం తన పేరెంట్స్ కు ఇష్టం లేదట. ఎప్పుడూ తన సినిమాల గురించి కూడా వారు పెద్దగా పట్టించుకోరట. అయితే ఈ కరోనా ప్రవాహంలో సుధీర్ బాబు, నాని కలయికలో రిలీజ్ అయిన మొదటి పెద్ద సినిమా “వి”.

    Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ పేరు..? వెల్లడించిన రియా?

    అమెజాన్ ప్రైమ్ లో యాక్షన్ సస్పెన్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రాణం పోసింది మాత్రం హీరో సుధీర్ బాబునే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ కూడా చేసి అలాగే రిస్కీ షాట్స్ లో సుధీర్ బాబు నటించి మెప్పించాడు. సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. తాజాగా తన తల్లిదండ్రులకు కూడా తన నటన బాగా నచ్చిందని ట్వీట్ చేశాడు. వి సినిమా విషయంలో నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా చూశాక.. వారి స్నేహితులు సన్నిహితులు నుండి వస్తోన్న స్పందన చూసి.. మా అమ్మానాన్న మొహంలో ఆనందబాష్పాలను చూసాను. ఈ సినిమాకి గానూ నాకు అనేక మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మీ అబ్బాయి చాలా బాగా చేశాడని అందరూ తనతో అంటున్నారని.. మా అమ్మ చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక మొదటి నుండి నేను సినిమాల్లోకి రావడం మా డాడికి ఇష్టం లేదు. అందుకే ఆయన నా సినిమాల గురించి గాని, నా సినిమాల వర్కౌట్స్ గురించి గాని ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఆయన వి సినిమా గురించి మెచ్చుకొన్నారు. మా తల్లిదండ్రులు కళ్ళల్లో గౌరవాన్ని చూస్తూంటే ఏదో సాధించిననే అనందంగా ఉంది’ అంటూ సుధీర్ బాబు ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

    Also Read: గుండు వెనుక అసలు కారణం ఇదా….?

    ఏమైనా వి సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా.. సుదీర్ బాబు మాత్రం ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్ అయ్యారు. సినిమాలో సుధీర్ బాబు చేసిన ఫైట్స్, డ్యాన్స్ లు, అలాగే ఆయన తన పాత్ర పరిధిలో కనబర్చిన నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. తన వినూత్నమైన నటనతో బాగా నటించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందింది. ఇక ఈ సినిమాలో అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించగా.. నాని విలన్ గా నటించాడు.