https://oktelugu.com/

మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్న టాలీవుడ్?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ ముందుకెళుతోంది. ప్రధానంగా డ్రగ్స్ లింకులు బయటపడటంతో పోలీసులు ఆ దిశగా విచారణను వేగవంతం చేస్తున్నారు. తీగలాడితే డొంక కదిలిన చందంగా చిత్రసీమలోని చీకటి కోణాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. Also Read: దిల్ రాజు మాస్టర్ స్టోక్.. ‘వి’ ప్రాఫిట్ ఎంతంటే? సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రెటీలను ఇప్పటికే పోలీసులు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2020 / 12:42 PM IST

    Tollywood drug case

    Follow us on

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ ముందుకెళుతోంది. ప్రధానంగా డ్రగ్స్ లింకులు బయటపడటంతో పోలీసులు ఆ దిశగా విచారణను వేగవంతం చేస్తున్నారు. తీగలాడితే డొంక కదిలిన చందంగా చిత్రసీమలోని చీకటి కోణాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

    Also Read: దిల్ రాజు మాస్టర్ స్టోక్.. ‘వి’ ప్రాఫిట్ ఎంతంటే?

    సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రెటీలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి.. ఆమె సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్ తదితరులను పోలీసులు విచారించి వారి నుంచి కీలక విషయాలను రాబట్టారు. ఇటీవల వీరంతా కోర్టుకు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబై ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది.

    ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి తనతోపాటు సుశాంత్ సింగ్ కు డ్రగ్స్ కోసం ఫైనాన్స్ చేసినట్లు వెల్లడించడం సంచలనం రేపింది. అదేవిధంగా డ్రగ్ డీలర్ బాసిత్ తానే తమను కలుస్తూ డ్రగ్స్ సరఫరా చేసేవాడని రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ విచారణలో వెల్లడించారు. ఇక రియా చక్రవర్తి ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి 25మంది సెలబ్రెటీల పేర్లు వెల్లడించినట్లు సమాచారం.

    ఈ లిస్టుతో టాలీవుడ్ కు సంబంధం ఉండటంతో ఇండస్ట్రీ బెంబెలెత్తిపోతోంది. ఇప్పటికే ఒకసారి డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ అభాసుపాలైంది. తాజాగా మరోసారి టాలీవుడ్లోని ప్రముఖ హీరోయిన్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ పేరుతోపాటు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్, రణ్ వీర్ సింగ్ సన్నిహితురాలు సైమోన్ ఖంబట్టాకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు రియా వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించడం సంచలనంగా మారింది.

    Also Read: తల్లిదండ్రుల పై సుధీర్ బాబు ఎమోషనల్ ట్వీట్ !

    ఈ కేసు అటూ ఇటూ తిరుగుతూ టాలీవుడ్ ఇండస్ట్రీని తాకింది. దీంతో టాలీవుడ్లోని ప్రముఖులంతా బెంబెలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎవరెవరకీ నోటీసులు వస్తాయో.. పోలీసులు ఎవరినీ అరెస్టు చేస్తారోననే ఆందోళన ప్రతీఒక్కరిలో నెలకొంది. గతంలోనూ టాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్ కేసులో ఇరుక్కోగా నాడు పోలీసులు కొంత హడావుడి చేసి చివరికీ ఏమి తేల్చకుండా మూసేశారు. అయితే ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసులోనైనా అసలు నిజాలు బయటికి వస్తాయా? లేదా ఒకరిద్దరిని బలి చేసి.. సినిమాటిక్ వేలో ముగిస్తారా? అనేది వేచి చూడాల్సిందే..!