Big shock to TDP: చంద్రబాబు, టీడీపీకి బిగ్ షాక్: ఆ సీనియర్ పార్టీ వీడడం ఖాయమా? ఏ పార్టీలోకంటే?

టీడీపీ అధినేత చంద్రబాబు కంటే కూడా ఆ పార్టీలో సీనియర్ పొలిటీషియన్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట ఉన్న టీడీపీ పెద్దమనిషి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్లో ఈయన ఒకరు. చాలా మంది ఇతర పార్టీలకు మారినా గోరంట్ల మాత్రం ఇప్పటికీ టీడీపీని నమ్ముకొనే ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నుంచి పోటీచేసిన గోరంట్ల బుచ్చయ్య […]

Written By: NARESH, Updated On : August 19, 2021 3:44 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు కంటే కూడా ఆ పార్టీలో సీనియర్ పొలిటీషియన్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట ఉన్న టీడీపీ పెద్దమనిషి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్లో ఈయన ఒకరు. చాలా మంది ఇతర పార్టీలకు మారినా గోరంట్ల మాత్రం ఇప్పటికీ టీడీపీని నమ్ముకొనే ఉన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నుంచి పోటీచేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chowdary) మాత్రం టీడీపీ తరుఫున గెలిచారు. ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా మంత్రి అయ్యేవారే. కానీ ప్రతిపక్షంలోకి జారడంతో అప్పటి నుంచే ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా చురుకుగా ఉండడం లేదు.

కాగా ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ బాట పట్టారు.తాజాగా సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా గోరంట్ల రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా పార్టీ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉంటున్నారు. ఈక్రమంలోనే రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం టీడీపీలో ఉన్న సీనియర్ నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. ఐదేళ్లు పదవి కోసం ఎదురుచూసినా ఆయనకు మంత్రి పదవిని ఏకోటాలోనూ చంద్రబాబు ఇవ్వలేదు.

ఇక 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరుఫున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం జగన్ తోపాటు వైసీపీ నేతలు, ఇతర ప్రభుత్వ అంశాలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు.

అయితే ఇంత చేస్తున్నా తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన అంతరంగికులతో వాపోయినట్లు సమాచారం. పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాల్లో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి గోరంట్లకు ఉన్న దారులు రెండే..ఒకటి అధికార వైసీపీలో చేరడం.. రెండోది బీజేపీ కండువా కప్పుకోవడం.. వైసీపీ అంతా జగన్ తో సహా అంతా యువ బ్యాచ్. ఆ పార్టీ వారికే ప్రాధాన్యం.. ఇలాంటి సీనియర్ ను జగన్ పట్టించుకుంటాడా? ప్రాధాన్యం ఇస్తాడా? అన్నది డౌట్. అందుకే గోరంట్ల బుచ్చయ్య ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ పని అయిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి బలంగా తయారవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అడుగులు రాజకీయంగా ఎటు పడుతాయన్నది ఆసక్తిగా మారిందంటున్నారు. గోరంట్ల వైసీపీలో చేరుతారా? లేక బీజేపీ బాట పడుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.