Andhra Pradesh, Telangana Water War: తెలంగాణకు ఏపీ షాక్.. శ్రీశైలం నీటిపై ఝలక్

జల వివాదాలు తెలుగు స్టేట్లలో ముదురుతున్నాయి. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రాంతాల్లో రోజురోజుకు ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ర్టం ఫిర్యాదు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఫిర్యాదు చేయడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిశీలన, ఎన్జీటీ విచారణ ఏపీకి ఆగ్రహం కలిగిస్తోంది. మరోవైపు శ్రీశైలం ప్రాజక్టులో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాయడంతో రెండు ప్రాంతాల్లో […]

Written By: Srinivas, Updated On : August 19, 2021 1:35 pm
Follow us on

జల వివాదాలు తెలుగు స్టేట్లలో ముదురుతున్నాయి. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రాంతాల్లో రోజురోజుకు ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ర్టం ఫిర్యాదు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఫిర్యాదు చేయడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిశీలన, ఎన్జీటీ విచారణ ఏపీకి ఆగ్రహం కలిగిస్తోంది. మరోవైపు శ్రీశైలం ప్రాజక్టులో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు లేఖ రాయడంతో రెండు ప్రాంతాల్లో నీటి గొడవలు ముదిరి పాకాన పడుతున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు సద్దుమణగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం శ్రీశైలం జలాశయంలో తెలంగాణ విద్యుత్ ఉప్పత్తిని నిలిపివేయాలని కోరడంతో రెండు ప్రాంతాల్లో గొడవలు ఇంకా తారా స్థాయికి చేరుతున్నాయి. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఏపీ ఆందోళన చేస్తోంది. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరు ఇవ్వలేమని పేర్కొంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండానే తెలంగాణ జెన్ కో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకోవడంపై ఏపీ సర్కారు మరోమారు అభ్యంతరం వ్యక్తం చేసింది.

జూన్ 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉప్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండా నీటిని వినియోగించుకుంటుందని ఏపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ కృష్ణా బోర్డు పట్టించుకోవడంల లేదని లేఖ రాసింది. నదీ జలాలపై కేంద్రం గజిట్ విడుదల చేయడంతో ఏపీ, తెలంగాణలో జల వివాదాలు ఇంకా ముదురుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఫిర్యాదు చేయగా అక్కడ జరుగుతున్న పనులను ఎన్జీటీ పరిశీలించి పనులు నిలిపివేయాలని సూచించింది. దీంతో రెండు ప్రాంతాల్లో నదీ జలాలపై ఇప్పటికి గొడవలే ప్రధానంగా సాగుతున్నాయి.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్సై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందని పేర్కొంది. తెలంగాణ అందించిన ఫొటోలను పరిశీలించిన ఎన్జీటీ పనులు భారీగానే జరిగినట్లు తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బిగించిన ఉచ్చలో ఏపీ పడిపోయింది. మళ్లీ తెలంగాణ రాష్ర్టం వల్ల తమకు నష్టం జరుగుతుందని పేర్కొంది. చెన్నై తాగునీటి అవసరాలు తీర్చలేమని తెలిపింది. దీంతో తెలంగాణ వాటాలో లెక్కించాలని మెలిక పెట్టడంతో చివరికి గాలివానలా మారుతోంది.