
దుబ్బాక గెలుపు.. జీహెచ్‌ఎంసీలో మెజార్టీతో బీజేపీ సంబురాలు చేసుకుంది. ఇక రాష్ట్రంలో తమకు సాటి ఎవరూ లేరని అనుకుంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని డిసైడ్ అయింది. ఆ మేరకు బీజేపీ లీడర్లు కూడా గళమెత్తారు. ప్రెస్‌మీట్లతో హోరెత్తించారు. దుబ్బాక, గ్రేటర్ ఎలక్షన్లతో వచ్చిన హైప్ అంతా.. ఇప్పుడు ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి దిగజార్చుకుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని చేజేతులారా వదులుకోవాల్సి రాగా.. నల్లగొండ స్థానంలో అయితే ఏకంగా నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు బీజేపీ పూర్తిగా చల్లబడిపోయినట్లైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతలంతా ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయారు.
Also Read: తెలంగాణ బీజేపీకి షాక్.. మళ్లీ మొదటికి వ్యవహారం
అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా సాగర్ ఉప ఎన్నికలో సత్తాచాటుతామనే నమ్మకం మరోవైపు పార్టీలో కనిపిస్తోంది. అందుకే.. సాగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మళ్లీ తనను తాను మరోసారి ప్రొజెక్టు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడడంతో సాగర్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సాగర్ ఉపఎన్నికలు బీజేపీకి అసలైన లిట్మస్ టెస్ట్. అక్కడ ప్రభావం చూపితేనే కానీ.. లేదంటే బీజేపీ పేరు మరికొద్ది రోజులు మరుగున పడిపోక తప్పదు. అక్కడి గెలుపుతో మరోసారి ప్రత్యామ్నాయం అని చెప్పుకునే వెసులుబాటు కూడా బీజేపీకి దొరుకుతుంది.
Also Read: కేసీఆర్ ను వణికించేలా తీన్మార్ మల్లన్న ఏంచేశాడు?
అయితే.. సాగర్‌లో బీజేపీకి పరిస్థితులు అంత ఈజీగా కలిసొస్తాయనే నమ్మకం లేదు. ఎందుకంటే.. అక్కడ బీజేపీకి పెద్దగా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల చిల్లర ఓట్లు మాత్రమే ఆ పార్టీకి లభించాయి. ఇప్పుడు ఆ స్థాయి నుంచి విజేతగా మారితే.. గొప్ప విజయం సాధించినట్లే అవుతుంది. బీజేపీకి తిరుగులేకుండా చేసేలా.. మళ్లీ ఇమేజ్ పెరుగుతుంది. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. బీజేపీది అంతా వాపేనని.. ఆ పార్టీ నేతలు గాలి వాటానికి వచ్చిన విజయాలతో రెచ్చిపోయారన్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఉప ఎన్నికతో ఒకవిధంగా బీజేపీకి అసలైన టాస్క్ మొదలైనట్లే.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఇదిలా ఉండగా.. ఈ ఉప ఎన్నికలు అటు అధికార పార్టీ కూడా ఛాలెంజ్‌గానే తీసుకుంటోంది. ఇక్కడి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకొని బీజేపీని బలహీనపర్చాలని చూస్తోంది. అంతేకాదు.. ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగలేదని చెప్పడానికి ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూడటం లేదని చెప్పడానికి కేసీఆర్ తనదైన వ్యూహాలు సిద్ధం చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఫజిల్‌ను బీజేపీ తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతానికి అక్కడి పరిస్థితులను బట్టి చూస్తుంటే.. సాగర్‌లో ప్రధానమైన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగించడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తాయి. గతంలోలాగా.. కాంగ్రెస్ సీన్‌లోకి రాకుండా బీజేపీ ఎంటర్ అయితే మాత్రం సీన్ మారే అవకాశాలు లేకపోలేదు. అలా జరిగితే బీజేపీ కాస్త ముందుకొస్తుంది. లేదంటే రాజకీయం పూర్తిగా మారిపోతుంది. ఆటోమెటిక్‌గా బీజేపీ హైప్ తగ్గినట్లే అవుతుంది.
Comments are closed.