Kavitha:కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో ఆయన కూతురు షాక్‌లోకి వెళ్లిపోయారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లిస్ట్‌లో కవిత పేరును చేర్చకపోవడంతో చర్చనీయాంశమైంది. 12 ఎమ్మెల్సీల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్ అనూహ్య ఎంపికలు చేశారు. సగానికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్సీలకు షాకిచ్చారు. రెండోసారి అవకాశం దక్కని ఎమ్మెల్సీల్లో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉండటం గమనార్హం.

ఆదివారం నాడు ఢిల్లీకి వెళ్లే ముందు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ జాబితాను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఆదివారం ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ మరో నాలుగు రోజులపాటు అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బయలుదేరడానికి ముందే ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. శనివారం రాత్రి ప్రగతిభవన్‌లో ఎమ్మెల్సీల ఎంపికను పూర్తి చేసి, ఆమేరకు నేతలకు సమాచారం కూడా అందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల మాదిరిగానే స్థానిక కోటా ఎమ్మెల్సీల విషయంలోనూ కేసీఆర్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు..
స్థానిక కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, అందులో ఏడుగురు సిట్టింగ్ లకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. వారి స్థానంలో ఏడుగురూ కొత్తవారికి అవకాశం కల్పించారు. మొత్తం 12 పదవుల్లో.. బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు 1 కేటాయించారు. 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఇప్పటికే బీఫామ్‌లు అందాయని, వారంతా సోమవారమే నామినేషన్లు వేయనున్నారని తెలుస్తోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. మహబూబ్‌నగర్‌లో ఒకరికి, కరీంనగర్‌లో ఒకరికి కొత్తవారికి అవకాశం కల్పించారు. తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. కరీంనగర్ జిల్లాలో రెండో స్థానంనుంచి ఆయన పేరును ఖరారు చేశారు. ఖమ్మం నుంచి తాత మధు, ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, మహబూబ్‌నగర్-2 నుంచి సాయిచంద్, నల్గొండ నుంచి కోటిరెడ్డి, మెదక్ నుంచి యాదవ్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి ఆకుల లలితకు అవకాశం కొత్తగా అవకాశం కల్పించారు.
Also Read: Hyderabad Software lady: కాబోయే భర్తను కలిసేందుకు వెళ్లి.. చివరకు ఈ ట్విస్ట్
వీరిలో కొందరు గతంలో ఇతర కోటాల నుంచి ఎమ్మెల్సీగా పనిచేసినవాళ్లూ ఉన్నారు. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీలైన పురాణం సతీష్, నారదాసు, దామోదర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, చిన్నపరెడ్డి, కల్వకుంట్ల కవితకు అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఇటీవలే గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, పాడి కౌశిక్ రెడ్డి, టి.రవీందర్ రావు, వెంకట్రామిరెడ్డిలు నామినేషన్లు వేయడం తెలిసిందే. వారి ఎన్నిక లాంఛనమే. మహబూబ్‌నగర్‌లో ఒకరికి, కరీంనగర్‌లో ఒకరికి కొత్తవారికి అవకాశం కల్పించారు. తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. కరీంనగర్ జిల్లాలో రెండో స్థానంనుంచి ఆయన పేరును ఖరారు చేశారు. ఖమ్మం నుంచి తాత మధు, ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, మహబూబ్‌నగర్-2 నుంచి సాయిచంద్, నల్గొండ నుంచి కోటిరెడ్డి, మెదక్ నుంచి యాదవ్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి ఆకుల లలితకు అవకాశం కొత్తగా అవకాశం కల్పించారు.
Also Read: KCR Jagan: కలిసిన కేసీఆర్, జగన్..చంద్రబాబు సింపతిపై కీలక సమాలోచనలు?