Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak: 'భీమ్లానాయక్'​ ప్రొడ్యూసర్ నుంచి లేటెస్ట్ అప్​డేట్​.. ట్రెండింగ్​లో ట్వీట్​

Bheemla Nayak: ‘భీమ్లానాయక్’​ ప్రొడ్యూసర్ నుంచి లేటెస్ట్ అప్​డేట్​.. ట్రెండింగ్​లో ట్వీట్​

Bheemla Nayak: ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద గట్టిపోటీనే నెలకొంది. అన్నీ పెద్ద హీరోల సినిమాలు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఇలా వరుసగా సినిమాలు విడుదల చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతారనే ఉద్దేశంతో.. ఇటీవలే నిర్మాతలు ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆర్​ఆర్​ఆర్​, రాధేశ్యామ్​, భీమ్లానాయక్​ నిర్మాతలు మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే ఎవ్వరూ విడుదల విషయంలో వెనక్కి తగ్గలేదు. అయితే, ఈ సినిమాల్లో ముఖ్యంగా భీమ్లానాయక్​ విడుదలను ఆపేయాలంటూ ఆ సినిమా నిర్మాతపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది.

bheemla nayak

దీంతో, భీమ్లానాయక్​ పోస్ట్​ పోన్​ కానుందని వార్తలు వచ్చాయి. అయితే, సినిమా మేకర్స్ మాత్రం ఈ వార్తను కొట్టిపడేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, సినిమా నిర్మాత నాగవంశీ ట్వీట్​తో పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. నిర్మాత నాగవంశీ భీమ్లానాయక్​ సినిమా పోస్ట్​ ప్రొడక్షన్​ పనులను స్టూడియోలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఫొటోను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు. మాట ప్రకారమే.. జనవరు 12న భీమ్లానాయక్​ థియేటర్లలోకి వస్తున్నాడని ఈ మేరకు తెలిపారు. దీంతో, ఈ సినిమా వాయిదాపై వచ్చిన వార్తలన్నింటికీ చెక్​ పెట్టినట్లైంది.

దీన్ని బట్టి తెలుస్తోంది సినిమా మేకర్స్ విడుదల విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారో.. కాగా, ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై మంచి హైప్​ క్రియేట్​ చేశాయి. కాగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular