Hero simbu: తమిళ స్టైలిష్ స్టార్ శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లూప్. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. కాగా, ఈ సందర్భంగా శింబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకు ముందు తన కెరీర్ చాలా డౌన్లో ఉండేదని.. అందుకే తన ఆహార్యాన్ని మార్చుకునేందుకు చాలా హార్డ్‌వర్క్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా తనను తాను మార్చుకునేందుకు 27 కిలోలు తగ్గినట్లు పేర్కొన్నారు.
మద్యపానం మానేసి.. ఆహార అలవాట్లను మార్చుకుని.. అన్ని విషయాల్లో నిబద్దతతో ముందుకు సాగినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సినిమాలో తాను చాలా కొత్తగా కనిపించనున్నట్లు పేర్కొన్నారు. లూప్ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కుదిరితే ఈ కథను స్ట్రయిట్ తెలుగులో తెరకెక్కించాలనుకుంటున్నట్లు వివరించాడు. కాగా, ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్, బన్నీ వాసుకు కృతజ్ఞతలు తెలుపారు శింబు.
కాగా, ఇటీవలే తన సినిమా మానాడు ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలను తలుచుకుని.. శింబు స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు తనకు ఎలాగైతే సపోర్ట్‌గా నిలిచారో.. మున్ముందు కూడా అలాగే నిలబడాలని అబిమానులను కోరారు. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం రోరింగ్ రెస్పాన్స్ లభించింది. “అన్నా… మేమెప్పుడూ నీతో ఉంటాం. వుయ్ లవ్యూ” అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More