Current Shock: ఏపీ, తెలంగాణ సీఎంలు మంచి దోస్త్ లే కాదు.. ప్రజలకు వడ్డింపుల్లోనూ ఒకే పద్ధతి పాటించారు.ముందుగా ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ సీఎం కరెంట్ ఛార్జీలు పెంచితే.. తాజాగా ఏపీ సీఎం జగన్ ‘షాక్’ ఇచ్చారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో నిత్యావసరాలు కొండెక్కాయి. వంటనూనె నుంచి పప్పుల వరకూ మండిపోతున్నాయి. ఇప్పుడు వీటికి తోడు తెలుగు ప్రజలకు మరో ‘షాక్’ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం బాటలోనే ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచింది.

ఏపీలో సామాన్యుల నడ్డి విరిచేలా కరెంట్ ఛార్జీలను పెంచి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెరిగిన రేట్లతో కరెంట్ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. 30 యూనిట్ల వరకూ 45 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 31-75 యూనిట్ల వరకూ 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అలాగే 76-125 వరకూ వాడితే రూ.1.40 పెరుగనుంది. 126-225 యూనిట్ల వరకూ వాడితే 1.57 పైసలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన విద్యుత్ టారిఫ్ ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ విడుదల చేశారు.
-పెంపు ఇలా..
గతంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ కేటగిరీల నుంచి శ్లాబ్ విధానంలోకి తెచ్చారు. ప్రస్తుతం ఆరు శ్లాబ్‌లుగా విభజించారు. గతంలో 50 యూనిట్ల వరకు ఒక శ్లాబ్ విధానం ఉండగా ఇప్పుడు దానిని 1 నుంచి 30 వరకే ఒక శ్లాబ్‌గా చేశారు. ఈ శ్లాబ్ పరిధిలోకి వచ్చే వినియోగదారులపై యూనిట్‌కు 45 పైసల భారం వేశారు. తర్వాత 31–75 యూనిట్ల శ్లాబ్ పరిధిలోకి వచ్చే విద్యుత్ వినియోగదారులపై యూనిట్ ధరను 91 పైసలు పెంచారు. ఇక 76 నుంచి 125 యూనిట్ల శ్లాబ్ పరిధిలోకి వచ్చే వినియోగదారులపై భారీగా చార్జీ వడ్డించారు. ఇక్కడ యూనిట్ ధరను 1.40 పెంచారు. ఈ మూడు శ్లాబ్‌ల పరిధిలో చాలా వరకు పేదలే ఉంటారు. మూడో శ్లాబ్ పరిధిలో పేదలు ఎక్కువ మంది ఉంటారు. ఇక మధ్యతరగతి ప్రజల నెలకు 126 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగిస్తారు. 126–225 శ్లాబ్ పరిధిలో విద్యుత్ యూనిట్ చార్జీని రూ.1.57 పెంచారు. ఇక్కడే సామాన్యులకు విద్యుత్ చార్జీ భారంగా మారనుంది. ఇక 226 నుంచి 400 యూనిట్ల పరిధిలోని శ్లాబ్ పరిధిలో ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉంటారు. వీరు వినియోగించే విద్యుత్ యూనిట్‌పై రూ.1.16 పెంచారు. 400 అంతకంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిపై 55 పైసలు పెంచింది.
Also Read: Chandrababu will Gives 40 Percent Tickets To Youth: యువతకే టికెట్లు.. చంద్రబాబు ప్లాన్ ఏంటి?
-సామాన్యుల నడ్డివిరిచే ధరలు..
విద్యుత్ చార్జీల పెంపు బాధాకరమైనా తప్పని సరి పరిస్థితుల్లోనే పెంచాల్సి వచ్చిందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి ప్రకటించారు. 20 ఏళ్ల తర్వాత విద్యుత్ చార్జిలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. డిస్కంల ప్రతిపాదనల మేరకు శ్లాబ్‌లను కుదించినట్లు పేర్కొన్నారు. మద్య తరగతి ప్రజలంతా మూడు, నాలుగో శ్లాబ్‌ల పరిధిలోనే ఉంటారు. మూడో శ్లాబ్‌లో యూనిటపై 1.40 పైసలు, నాలుగో శ్లాబ్ పరిధిలో యూనిట్‌పై 1.57 పెంచడంతో మధ్య తరగతి ప్రజల నడ్డి విరగడం ఖాయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
-ఎగువ తరగతి వారికి తక్కువ పెంపు..
400 అంతకంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిలో ఎక్కువ శాతం ఉన్నత వర్గాల వారే ఉంటారు. అయినప్పటికీ ఏపీ ఈఆర్సీ వీరిపై కరుణ చూపింది. వీరు ఇప్పటికే అధిక విద్యుత్ చెల్లిస్తున్నారు అన్న కారణంలో వారిపై తక్కువ భారం మోపింది. ఇక్కడే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత వర్గాల వారు కాబట్టే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని, వారిపై కరుణ చూపడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు డిస్కంలు ఇంత విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించకపోయినా ఏపీ ఈఆర్సీ అదనంగా పెంపునకు అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
ఏపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంపుతో సామాన్యుల నడ్డి విరగనుంది. రాష్ట్రంలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన విద్యుత్ టారిఫ్ ను బుధవారం విడుదల చేశారు. ఈ ప్రకారం 30 యూనిట్ల వరకూ 45 పైసలు పెంచారు. 31-75 యూనిట్ల వారికి యూనిట్ కు 95 పైసలు పెంచారు. 126-225 యూనిట్ల వారికి యూనిట్ కు రూ.1.57 పెంచారు. 226-400 యూనిట్ల వారికి యూనిట్ కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్ కు రూ.55 పెుంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక కేటగిరిలను రద్దు చేసి కరెంట్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీటిని రద్దు చేసి ఈ స్థానంలో 6 స్లాబ్ లను తీసుకొచ్చింది. దాదాపు యూనిట్ కు 45 పైసల నుంచి స్లాబుల వారీగా రెండు రూపాయల వరకూ రేట్ పెరిగింది. ఇప్పటికే అన్ని రేట్లు పెరిగి ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఈ కరెంట్ చార్జీల పెంపు మరింత భారీగా మారింది.
Also Read: Uniform Secretariat Employees: జగన్ చెప్పినదేమిటి? చేస్తున్నదేమిటి? సచివాలయ ఉద్యోగులకు తీరని వ్యథ
[…] Mudragada Padmanabham Fire on Radhakrishna: కాపు సామాజికవర్గం గురించి పోరాడుతున్న నాయకులు అదే సామాజికవర్గానికి చెందిన వారికి ఆర్థికంగా ప్రొత్సహించిన దాఖలాలు ఉన్నాయా? సంఖ్యాబలంలో ఎక్కువగా ఉన్న కాపుల్లో చెప్పుకోదగ్గ పారిశ్రామిక వేత్తలు ఎందుకు లేరు? కాపు ఉద్యమ నాయకులను ఉద్దేశించి ఇటీవల పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడును ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ సంధించిన ప్రశ్నలివి. దీనిపై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ధీటుగా స్పందించారు. వేమూరి రాధాక్రిష్ణకు లేఖ రాశారు. రాధాక్రిష్ణ ప్రారంభ జీవితం నుంచి ఇప్పటివరకూ ఆయన చేపట్టిన రాచ కార్యాలను గుర్తుచేస్తూ కడిగి పారేశారు. ‘మీ స్థాయికి తగని వ్యక్తి అయిన ముద్రగడ పద్మనాభం’ అంటూ ప్రారంభించిన లేఖ ఆసాంతం రాధాక్రిష్ణ ఎలా ఎదిగింది? ఎలా పైకొచ్చింది? ఆంధ్రజ్యోతి పత్రికలో చిరుద్యోగిగా ఉండి అదే పత్రికకు యజమానిగా ఎలా మారింది? ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఎలా నాశనం చేశారు? సామాజిక సేవా ముసుగులో చేపట్టిన వసూలు పర్వం…ఇలా రాధాక్రిష్ణ చేసిన ప్రతీ పనిని గుర్తుచేస్తూ కాస్త వెటకారంతో రాసిన ఈ లేఖ పెద్ద ప్రకంపనలకే దారితీసింది. సర్వత్రా చర్చనీయాంశమైంది. […]
[…] Red Chilli Record Price: మిర్చికి మంచి ధర పలుకుతోంది. ఇన్నాళ్లు ధర లేదని బాధ పడిన రైతులకు మిర్చి ఘాటు ధర పలుకుతూ వారిలో ఆశ్చర్యాన్ని నింపుతోంది. కొన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చిన ధర ఏకంగా అమాంతం పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల కష్టాలు తీరేలా ధర రూ.52 వేల కు చేరడం రైతుల మోముల్లో చిరునవ్వు కురిపిస్తోంది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చికి రూ. 52 వేల ధర పలకడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు. […]
[…] Also Read: Current Shock: కేసీఆర్ యే కాదు.. జగన్ కూడా ‘షాక్… […]
[…] Late Marriage Problems: ప్రతి మనిషి జీవితంలో పెండ్లి అనేది చాలా ముఖ్యం. కానీ ఇప్పటి తరంలో యువత చాలా లేటు వయసులో పెండ్లి చేసుకుంటున్నారు. 30 నుంచి 40 ఏండ్లు వచ్చిన తర్వాత పెండ్లి చేసుకుని దాంపత్య జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే పెండ్లి చేసుకునేందుకు ఇప్పటి యువత ఇష్టపడుతున్నారు. […]
[…] CM KCR- China Jeeyar: తెలంగాణలో కేసీఆర్‌కు చినజీయర్ స్వామికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేసీఆర్ రాజకీయంగా గానీ లేదంటే ఆధ్యాత్మికంగా గానీ ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకుంటే మాత్రం కచ్చితంగా చినజీయర్ స్వామి సలహాలు తీసుకునే వారు. ఒకప్పుడు కేంద్రంలో ఏమైనా పనులు కావాలన్నా కూడా చినజీయర్ ద్వారానే చేయించుకునేవారనే టాక్ ఇప్పటికీ ఉంది. […]