Nithin Macherla Niyojakavargam: హీరో నితిన్ పుట్టినరోజు నేడు. ఈ పుట్టినరోజు నితిన్ కి ప్రత్యేకం, కారణం.. నితిన్ కెరీర్ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉంది. నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ వీడియో రిలీజ్ అయ్యింది. ‘మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ అటాక్’ పేరుతో వచ్చిన ఈ వీడియోలో నితిన్ మాస్ లుక్ లో అదరగొట్టాడు.

ఈ వీడియోలో నితిన్ కత్తి పట్టుకుని రౌడీలను వెంటాడుతూ కనిపించాడు. ఈ వీడియోని బట్టి ఇది ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. ఎప్పటి నుంచో నితిన్ మాస్ హీరో అవాలని చాలా ఆశ పడుతున్నాడు. కానీ, నితిన్ పై మాస్ ఎలిమెంట్స్ వర్కౌట్ కావు, లవ్ స్టోరీలు బాగా సెట్ అవుతాయి. కాకపోతే, నితిన్ కి ఉన్న ఏకైక కోరిక.. మాస్ హీరో అవాలని,
Also Read: Ram Charan Screen Time With Chiranjeevi In Acharya: ‘చిరు – చరణ్’ ఎంతసేపు కలిసి ఉంటారో తెలుసా ?
అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ క్రమంలోనే మాస్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ చేస్తున్నాడు. ఈ సినిమా జులై 8న రిలీజ్ కానుంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాదిలో నితిన్ మూడు చిత్రాలు చేశాడు. ‘రంగ్ దే’, ‘చెక్’, ‘మాస్ట్రో’… ఈ మూడు హిట్ కాలేకపోయాయి.
మొత్తానికి నితిన్ కి 2021 పూర్తిగా కలసిరాలేదు. మరి ఈ 2022 అయినా కలిసి వస్తోందేమో చూడాలి. మాచర్ల నియోజకవర్గం సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా కత్తి పట్టుకుని రౌడీలను వెంటాడుతూ నితిన్ మరీ వైల్డ్ గా కనిపిస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమా ఏమైనా హిట్ అవుతుందేమో చూడాలి. అన్నట్టు పైగా ఇది ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ జోనర్ కూడా నితిన్ కి పూర్తిగా కొత్త.

కాకపోతే, నితిన్ యూట్యూబ్‌లో తన హిందీ డబ్బింగ్ చిత్రాల ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. యూట్యూబ్‌లో నితిన్ హిందీ డబ్బింగ్ చిత్రాలన్నిటికి కలిపి 2.3 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ ఘనత సాధించిన మొదటి మరియు ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్. మొత్తానికి నితిన్ స్టార్ హీరోగా తన స్థాయిని పెంచుకోలేకపోయినా.. తన గుర్తింపును మాత్రం బాగానే ఎలివేట్ చేసుకున్నాడు.
Also Read: Hero Nithin Birthday Special: హ్యాపీ బర్త్ డే నితిన్… తెలంగాణ రెండో కథానాయకుడు
[…] Tollywood Heroes Wives: టాలీవుడ్ లో చాలామంది భర్తలు హీరోలుగా రాణిస్తున్నారు. అయితే వారి భార్యలు కొందరు సినిమా రంగంలో రాణిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇతర రంగాల్లో రాణిస్తూ.. సంపాదనలో భర్తలకు పోటీ ఇస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో ఎవరెవరు భర్తలకు పోటీ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఓ ఏడుగురు భార్యలు తమ భర్తలతో పోటీపడి సంపాదిస్తున్నారు. […]
[…] Also Read: Nithin Macherla Niyojakavargam: బర్త్ డే నాడు కత్తి పట్టి … […]
[…] Pakka Commercial Release Date Fixed: హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” సినిమా పై మొత్తానికి ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జులై 1వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. […]
[…] Ghani Movie Non Theatrical Deal: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనుండగా.. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ జరిగింది. సుమారు రూ.25 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. […]