https://oktelugu.com/

ఆ టీఆర్ఎస్ ఎంపీలకు పెద్ద కష్టం…

తెలంగాణ రాష్ర్ట సమితిలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు రాజ్యసభ సభ్యులుగా అవకాశం దక్కినా ప్రస్తుతం మౌనంగా ఉండిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కీలక నేతలుగా ఉండి కూడా అధికారిక కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నా గులాబీ పార్టీ వారికి కలిసి రావడం లేదని తెలుస్తోంది. ఇందూరులో ఒకప్పుడు వెలుగు వెలిగి రాష్ర్ట రాజకీయాలను శాసించిన నేతలు డి.శ్రీనివాస్ సురేష్ రెడ్డి. ఇద్దరు నాటకీయ పరిణామాల […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 5, 2021 3:15 pm
    Follow us on

    TRS MPsతెలంగాణ రాష్ర్ట సమితిలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు రాజ్యసభ సభ్యులుగా అవకాశం దక్కినా ప్రస్తుతం మౌనంగా ఉండిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కీలక నేతలుగా ఉండి కూడా అధికారిక కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నా గులాబీ పార్టీ వారికి కలిసి రావడం లేదని తెలుస్తోంది. ఇందూరులో ఒకప్పుడు వెలుగు వెలిగి రాష్ర్ట రాజకీయాలను శాసించిన నేతలు డి.శ్రీనివాస్ సురేష్ రెడ్డి. ఇద్దరు నాటకీయ పరిణామాల మధ్య రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.

    డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టిన ఘనత ఉన్న నాయకుడు. తన దైన శైలిలో పార్టీని విజయతీరాలకు చేర్చిన నేర్పరి. ప్రస్తుతం టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయంతో పార్టీ సేవలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. కేసీఆర్ కూతురు కవిత సైతం డి. శ్రీనివాస్ ను టార్గెట్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే డీఎస్ ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇక శాసనసభ స్పీకర్ గా వ్యవహరించిన సురేష్ రెడ్డి జిల్లాలో తన రాజకీయ ప్రాతినిధ్యం చూపించారు. ప్రస్తుతం సురేష్ రెడ్డిని సైతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా చేసినా ఆయన సేవలను కూడా పార్టీ తీసుకోవడం లేదు.

    అందరు పార్టీ మారితే తన పలుకుబడి కూడా పెంచుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కానీ డీఎస్, సురేష్ రెడ్డి మాత్రం తమ పదవులు సాధించినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం గమనార్హం. పార్టీ కూడా వారి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయ. ఈ నేపథ్యంలో డీఎస్, సురేష్ రెడ్డిలను అసలు ఎందుకు అధిష్టానం దూరం పెట్టిందనే విషయాలు అందరిలో ఆసక్తి గొలుపుతున్నాయి. పథకం ప్రకారమే పక్కన పెట్టిందా లేక ఉద్దేశపూర్వకంగా చేసిందా అని పలువురిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    జిల్లాలో ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో తిరిగిన నేతలు ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా చేతిలో అధికారం ఉన్నా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడంపై వరి అనుచరుల్లో అసహనం పెరుగుతోంది. జిల్లా నేతలకు రాజ్యసభ పదవులు అచ్చి రావడం లేదని తెలుస్తోంది. ఇందూరు రాజకీయాలను శాసించిన నేతలు రాబోయే రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక వ్యూహం మార్చుకుంటారా వేచి చూడాల్సిందే.