ఇక మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ విషయానికి వస్తే.. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకువస్తున్నాడు మనోజ్. ఈ సినిమాకి నిర్మాత కూడా మనోజే కావడంతో అప్పులు చేసి మరీ ఈ సినిమాని నిర్మించాల్సి వస్తోంది. అందుకే, ఈ సినిమా కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేయాలనే కసితో ఉన్నాడు మనోజ్.
అయితే, దాదాపు నాలుగేళ్ల నుంచి ఏ చిత్రాన్ని చేయని మనోజ్.. చివరగా 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ అనే డిజాస్టర్ మూవీతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాడు. ఎట్టకేలకు గత ఏడాది ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను మొదలుపెట్టినా కరోనా కారణంగా లేట్ అయింది. మధ్యలో షూట్ చేసుకునే అవకాశం వచ్చినా ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా షూట్ కి బ్రేక్ పడింది.
స్టార్ హీరో కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నా.. మంచు మనోజ్ మాములు హీరోలాగే మిగిలిపోవాల్సి వచ్చింది. కెరీర్ మొదటి నుండి వైవిధ్యం కోసం అనవసరమైన ప్రయత్నాలు చేసి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోలేకపోయాడు. అయితే, మధ్యలో మోహన్ బాబు కలుగజేసుకుని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. ఎందుకో మనోజ్ ఖాతాలో సక్సెస్ ఫుల్ సినిమాలు పడలేదు.