Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా భారత్ కు చెందిన రిషి సునక్ ఎన్నికయ్యాడు. ఆయన ఎన్నికతో ఆ దేశంలోనే కాదు.. మన దేశంలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు భారత్ ను ఆంగ్లేయులు పాలించారు.. కానీ ఆంగ్లేయులకు అధిపతిగా ఇక భారతీయుడు నిలవడం ఇండియాకు గర్వకారణమని ఇక్కడి వారు చర్చించుకుంటున్నారు. రిషి సునక్ ఎన్నికపై ఏపీలోని భీమవరంలోనూ ప్రత్యేకంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన గెలుపు వెనుక భీమవరం కుర్రోడి పాత్ర కీలకంగా ఉంది. రిషి ప్రధాని కావడానికి ఈ కుర్రోడు ప్రధాన పాత్ర వహించాడు. ఇంతకీ రిషి సునక్ కు భీమవరం వ్యక్తికి ఉన్నసంబంధం ఏంటి..?

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ తప్పుకోవడంతో భారత సంతతికి చెందిన రిషి సునక్ కు అవకాశం వచ్చింది. దీంతో అధిక మెజారిటీ ఎంపీల మద్దతుతో రిషి బ్రిటన్ గద్దెనెక్కాడు. వచ్చీ రాగానే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలన్నారు. ముందు ముందు మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేసి మళ్లీ యధాస్థానానికి తీసుకొస్తానని రిషి ప్రసంగించారు.
ఇక రిషి సునక్ ఇలా విజయపథంలో దూసుకెళ్లడం వెనక భీమవరం కుర్రాడి పాత్ర ప్రధానంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన కేజీఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ కుమారుడు ఆరేటి ఉదయ్ కన్జర్వేటివ్ పార్టీ తరుపున కింగ్ స్టర్ పట్టణానికి కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అయితే రిషి సునక్ ప్రధాని కావడానికి ఆరేటి ఉదయ్ కీలక పాత్ర పోషించారు. కొంతమంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో ఉదయ్ కృషి చేశాడట. పరాయి దేశంలో ఒక ఇండియన్ ప్రధాని అవుతుంటే ఎవరు మాత్రం కాదనను. అందుకే రిషి ప్రధాని కావాలని ఉదయ్ కీలకంగా వ్యవహరించాడట. మొత్తానికి రిషి ప్రధాని కావడంతో ఇప్పుడు ఉదయ్ ఫుల్ హ్యాపీ అయ్యాడట.

ఈ విషయం తెలిసిన భీమవరంలో సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ కు చెందిన రిషి సునక్ ప్రధాని కావడంలో ఆరేటి ఉదయ్ కి ఫ్యూచర్లో కీలక బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. ఈ సందర్బంగా భారత్ కు చెందిన కొన్ని మీడియా సంస్థలకు ఉదయ్ లైవ్ లోకి వచ్చారు. త్వరలో రిషి సునక్ భారత్ విజిట్ ఉంటుందని, అయితే ప్రధాని మోదీతో ఉండొచ్చని పేర్కొన్నాడు. ఇక ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి సునక్ ఇప్పుడు ప్రధాని హోదాలో భారత్ కు వచ్చి ఎవరి ఇంటికి వెళ్తారోనని ఆసక్తి నెలకొంది. కొందరు రిషి సునక్ ను భీమవరం తీసుకురావాలని సోషల్ మీడియా వేదికగా ఉదయ్ ని కోరుతున్నారు.