ELONMUSK ParagAgrawal : కోట్ల రూపాయల వేతనం.. ప్రపంచంలోనే నంబర్ 1 సోషల్ మీడియా దిగ్గజం.. దాన్ని నడిపించే సీఈవో మన భారతీయుడే.. అలాంటి ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ పోస్ట్ ఊస్ట్ అయ్యింది. ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు పూర్తిచేయగానే మొదట చేసిన పని ఏంటో తెలుసా? ఆయనకు ఎదురు తిరిగిన ట్విట్టర్ సీఈవో, సీఎఫ్.వో, లీగల్ సెల్, సహా కీలక ఉన్నతాధికారులను తొలగించేశాడు. పైసలు అయినవి.. పైగా కొనేశాడు. ఇక తనను ఎదురించే వారిని ఎందుకు ఉంచుకుంటాడు? అందుకే ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి రాగానే తొట్టతొలిగా అందులోంచి మన భారతీయులైన పరాగ్, విజయ్ గద్దె లాంటి కీలక ఉన్నతాధికారులను తీసిపడేశారు.

Doesn't matter if you are CEO of a gaint social media platform.
The job security will only be in Government jobs. #ParagAgrawal #ELONMUSK pic.twitter.com/KoZXdYTb30— manglam (@manglamiam) October 28, 2022
అంతటి ట్విట్టర్ సీఈవోకే ఉద్యోగ భద్రతలేకుండా రోడ్డునపడడం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు, నెటిజన్లు షాక్ అవుతున్న పరిస్థితి. అందుకే మస్క్ ట్విట్టర్ టేకోవర్ కాగానే.. వీరి జాబ్ లు తీసేయగానే అదే ట్విట్టర్ లో మీమ్స్ పోటెత్తాయి.
#ELONMUSK after #TwitterTakeover and firing #ParagAgrawal , Ned Segal and Vijay Gadde 😂 pic.twitter.com/6ZRHUwjdAP
— 🏴☠️ (@MajhewalaSingh) October 28, 2022
ట్విట్టర్ సీఈవో జాబ్ కంటే మన గవర్నమెంట్ ఉద్యోగాలు బెటర్ అని.. పనిచేసినా.. చేయకున్నా తీసిపారేసేవారే ఉండరని.. అంతటి సెక్యూరిటీ జాబ్ ప్రభుత్వం ఉద్యోగం తప్ప వేరేది కాదంటూ ఈ ఘటనను ఉదాహరణగా తీసుకొని మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనకు కోపం వచ్చినా.. యజమానికి కోపం వచ్చినా బలయ్యేది మనమే. అందుకే ట్విట్టర్ సీఈవోకే జాబ్ కోల్పోవడం తప్పలేదు.. ఆఫ్ట్రాల్ మనమెంత? అందుకే ఈ ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తాయి. ఆ ఫన్నీ మీమ్స్ ఏంటో చూసి మీరూ ఎంజాయ్ చేయండి..
#ParagAgrawal
We love this video😀🤣 pic.twitter.com/kUfEWi3zqv— R.Vashishtha (@RadhaVashisht12) October 28, 2022
#ParagAgrawal is back with a bang in front of Twitter HQ pic.twitter.com/U2h1ftSQqL
— Atrij Kasera (@AtrijKasera) October 28, 2022
https://twitter.com/liberandujivi/status/1585828624359620608?s=20&t=ZL6jwv0TFTnbClhsTvxrFQ