Bhatti Vikramarka: మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ లో మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతూ ఉంటుంది. ఎవరికివారు మేమే గొప్ప అని అనుకుంటూ ఉంటారు. తాము లేకపోతే పార్టీ నడవదని చెప్పుకుంటూ ఉంటారు. దీనివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయినప్పటికీ నేతల పనితీరులో మాత్రం మార్పు రాలేదు. ఇకముందు వస్తున్నదనే గ్యారెంటీ కూడా లేదు. కర్ణాటకలో విజయం సాధించిన అనంతరం తెలంగాణలోనూ అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. మొన్నటిదాకా రెండవ స్థానంలో కొనసాగిన భారతీయ జనతా పార్టీ ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమించింది. వాస్తవానికి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే భారతీయ జనతా పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తోంది.
అలా అడుగులు పడుతున్నాయా?
వాస్తవానికి రెండో స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్.. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీని ఓడించి తెలంగాణ పీఠాన్ని అధిష్టించాలని కోరుకుంటున్నది. అయితే దీనికి సంబంధించి బలమైన అడుగులు పడుతున్నాయా అంటే.. ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పీఠంపై పలువురు నేతలు కన్ను వేయడంతో ఎవరికి వారు తమ సొంత కోటరీని ప్రొజెక్ట్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి మధ్య ఇలాంటి పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన కూడా వారు ఉదహరిస్తున్నారు.
షర్మిలను ఆహ్వానించి..
వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆమె చర్చలు జరిపారు. ఇక త్వరలో విలీనం జరుగుతుందని ఆమె సంకేతాలు ఇచ్చారు. అయితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. కానీ అనూహ్యంగా భట్టి విక్రమార్క షర్మిలను వెనకేసుకు రావడం ప్రారంభించారు. ఆమెను తెలంగాణ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అంతేకాకుండా ఇడుపులపాయ వెళ్లి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దీని ద్వారా ఆయన రాజశేఖర్ రెడ్డి అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి సాగించిన పాదయాత్ర స్ఫూర్తితోనే తాను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేశానని భట్టి గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడంలో రాజశేఖర్ రెడ్డి పాత్ర మరువలేనిది. అయితే రాజశేఖర్ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా భట్టి విక్రమార్క మంచి మార్కులు సాధించారు.
ఒక్కసారి తలచిందీ లేదు
రాజశేఖర్ రెడ్డిని మాత్రం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు తర్వాత ఇంతవరకు ఒక్కరోజు కూడా పెద్దగా తలచింది లేదు. ఇడుపులపాయ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించింది కూడా లేదు. తాను అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఒకప్పటి తన గురువు చంద్రబాబు కు అనుకూలంగా పనిచేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా అధిపతులను మాత్రమే కలిశారు. అంటే తాను చంద్రబాబు మనిషినని చెప్పకనే చెప్పారు అని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి సాగిస్తున్న చర్యలకు భట్టి సరైన కౌంటర్ ఇస్తుండడంతో.. ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాల విస్తరణ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న వార్ దీనికి దారితీస్తుందోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలవరపడుతున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ నుంచి రాజశేఖర్ రెడ్డి పాత్రను విడదీసే పరిస్థితి లేదు. ఎంతో కొంత రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు గా ఉన్నారు. అయితే వారి అభిమానం చూడగొనడంలో భట్టి మాస్టర్ స్కెచ్ వేశారు. మరి ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి తేరుకుంటారా? అనేది కాలమే చెప్పాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bhatti vikramarka master sketch is it difficult for revanth to recover
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com