
Ghatak: పూర్వం రోజుల్లో యుద్ధాలు మనుషుల మధ్యే జరిగేవి. కానీ కాలం మారింది. మానవుల అవసరం లేకుండా యంత్రాలతోనే యుద్ధం చేయడం ఇప్పుడు మారిన స్టైల్. దీంతో ప్రపంచ దేశాలన్ని మానవ రహిత యంత్రాలకే మొగ్గు చూపుతున్నాయి. భవిష్యత్ లో యుద్ధాలు మొత్తం యంత్రాలతోనే జరగనున్నట్లు తెలుస్తోంది. శత్రు స్థావరాలను నాశనం చేసేందుకు డ్రోన్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో ఈ ఏడాది డ్రోన్ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి.
భారత రక్షణ రంగ నిపుణులు మానవ రహిత యుద్ధ విమానం ఘాతక్ రూపకల్పనకు 2016లో భారత ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. డీఆర్డీవో, రక్షణ శాఖ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భారత నావికా దళం భవిష్యత్ లో వినియోగించనున్నట్లు తెలుస్తోంది. భారత రక్షణ రంగంలో ఘాతక్ అందుబాటులోకి రానుంది. దీంతో దాయాది దేశాలకు హెచ్చరికలు పంపుతోంది.
శత్రువుపై విరుచుకుపడే డ్రోన్ల వ్యవస్థ రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆగస్టులో 75 డ్రోన్లను ఏకకాలంలో గాల్లోకి ఎగురవేసి నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఆత్మాహుతి దాడి చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులతో ప్రైవేటు భాగస్వామ్యం తీసుకుంటున్నారు.
కొవిడ్ కారణంగా డ్రోన్ ప్రయోగాలు ఆలస్యం అయ్యాయి. టెక్నాలజీని ఉపయోగించుకుని అన్ని దేశాలకు దీటుగా భారతదేశం తన శక్తిని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల వినియోగంతో శత్రు దేశాలను నాశనం చేసే సాంకేతికతను వాడుకుంటోంది. దీంతో భవిష్యత్ లో అన్ని దేశాలకు తగిన సమాధానం చెప్పేందుకు నిర్ణయించుకుంటోంది.