Bharat Jodo Yatra: కేంద్రంలో పదేళ్లు అధికారానికి దూరమై.. రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ భారత్‌జోడో పేరుతో ఐదు రోజుల క్రితం పాదయాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 3500 కిలోమీటర్లు, ఐదు నెలలపాటు సాగే ఈ యాత్రపై పార్టీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే లౌకిత్వం పేరుతో మైనారిటీలకు కొమ్ముకాస్తూ మెజారిటీ హిందువులను పట్టించుకోదన్న అపవాదు కాంగ్రెస్‌కు ఉంది. ఇదే పదేళ్లు ఆ పార్టీని కేంద్రంలో అధికారానికి కూడా దూరం చేసింది. నరేంద్రమోదీ, అమిత్‌షా ద్వయం దేశంలోని మెజారిటీ వర్గాన్ని ఐక్యం చేసి అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో మార్పు వచ్చిన దాఖలాలు కనిపించడంలేదు. భారత్‌జోడో అంటూ బయల్దేరిన రాహల్ మళ్లీ అదే వర్గ రాజకీయం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పాస్టర్ వ్యాఖ్యలపై మౌనం ఎందుకు?
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్‌గాంధీ నాలుగు రోజులు ఆ రాష్ట్రంలో యాత్ర ముగించుకుని కేరళలో అడుగు పెట్టారు. ఈ రాష్ట్రలోకి రాగానే వివాదాస్పద పాస్టర్ రాహుల్‌ను కలిశారు. అంతటితో ఆగకుండా ్రMీ స్తే నిజమైన దేవుడు అంటూ, శక్తిలాగా క్రీస్తును పరిగణించరు, దేవుడు ఒక్కడే అతడే క్రీస్తు అని రాహుల్‌లో మాట్లాడారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ నాయకులు బయటపెట్టిన ఈ వీడియోలో క్రీస్తు గొప్పదనం చెబుతూ, హిందువులు ఆరాధించే శక్తిని కించపర్చడం స్పష్టంగా ఉంది. ఆ సమయంలో పాస్టర్ వ్యాఖ్యలను ఖండించాల్సిన రాహుల్ మౌనంగా ఉండడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ను ఐక్యం చేస్తానంటూ బయల్దేరిన వ్యక్తి ఓట్ల కోసం కేరళలో మెజారీవర్గమైన క్రిస్టియన్ల కోట్ల కోసం హిందూ దేవతలను కించపర్చినా రాహుల్ మౌనంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు.
సమానంగా ఎందుకు చూడలేకపోతున్నారు..
జాతీయ పార్టీ సీనియర్ నేతగా రాహుల్‌గాంధీ పాస్టర్ చేసిన వ్యాఖ్యలను వారించాల్సింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందువులు, ముస్లింలు, క్రిష్టియన్లను ఐక్యం చేయాలని భావిస్తున్న రాహుల్‌గాంధీ మతవిభేదాలు లేని రాజకీయం చేయాలని భావిస్తున్నారు. నిజమైన జోడో స్ఫూర్తి ఉంటే పాస్టర్ వ్యాఖ్యలను ఏకీభవించకుండా ఎవరి దేవుడిని వారు ఆరాధిస్తారు అనాలి. కానీ అలా అనకుండా మైనార్టీల బుజ్జగింపుకోసం మెజార్జీల మనోభావాలు నొప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని ఐక్యం చేస్తానంటున్న రాహుల్ అందరినీ సమానంగా చూడకపోవడం సరికాదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే కేరళలో పలు వివాదాలు..
కేరళలో ఇప్పటికే హిందువులు మైనార్టీలుగా మారిపోయారు. పలు వివాదాలు కూడా ఆ రాష్ట్రంలో జరిగాయి. శబరిమళలోకి మహిళలను అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ నిర్ణయంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. త్రివేద్రంలోని అనంతపద్మనాభ స్వామి ఆస్తుల విషయం, గుప్త నిధుల వెలికి తీత విషయం కూడా అప్పట్లో వివాదానికి దారితీసింది. మరోవైపు విదేశాల నుంచి కేరళలోని చర్చిలకు వేల కోట్ల రూపాయల నిధులు రావడం, హిందూ ఆలయాలను అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అందరినీ కలుపుకుపోవాల్సిన సమయంలో రాహుల్ పాస్టర్‌తో రాహుల్ వ్యవహరించిన తీరు మెజారిటీ వర్గాన్ని ఆ పార్టీకి మరోమారు దూరం చేసే ప్రమాదం ఉంది.