Bigg Boss Telugu 6 Week 1 Eviction: బిగ్ బాస్ సండే వీకెండ్ చాలా ఫండేగా మారింది. నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే కంటెస్టెంట్ల అందిరితో ఓ గేమ్ ఆడించాడు. గెలిచిన వారికి బిగ్ బాస్ తరుఫున ఒక గిఫ్ట్ ఆంపార్ కానుకగా ఇస్తానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఇంటిలోని సభ్యులకు సంబంధించిన ప్రశ్నలే అడిగారు. వాటికి బాలాదిత్య, అర్జున్ లు ఎక్కువ సమాధానాలు చెప్పడంతో వారిద్దరి మధ్య పోటీ పెట్టారు. వీరిద్దరిలో బాలాదిత్య గెలవడంతో ఆ గిఫ్ట్ అంపార్ ను నాగార్జున బహూకరించాడు.

బిగ్ బాస్ లో మిగిలిన ఐదుగురిలో ఒకరిని సేఫ్ చేశాడు నాగార్జున. ఐదుగురితో కత్తులను ఒర నుంచి తెరిపించాడు. అందులో రెడ్ కత్తి వస్తే నాట్ సేఫ్ అని.. గ్రీన్ కత్తి వస్తే సేఫ్ అని టాస్క్ పెట్టాడు. ఇందులో ఫైమాకు గ్రీన్ కత్తి రావడంతో ఆమె సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు
అనంతరం మరో టాస్క్ ఇచ్చి నామినేషన్స్ లో ఉన్న నలుగురిలో ఒకరిని సేవ్ చేశాడు నాగార్జున. బైక్ నంబర్ ప్లేట్ ఇచ్చి అందులో సరైంది వచ్చిన వారు సేవ్ అని తెలిపారు. అందులో సింగర్ రేవంత్ కు నంబర్ ప్లేట్ సరైంది రావడంతో అతడు ఈ వారం సేవ్ అయినట్టు తెలిపాడు.
ఇక అనంతరం మరో బజర్ నొక్కితే పాట పాడే గేమ్ ఆడించిన నాగార్జున కంటెస్టెంట్లతో డ్యాన్సులు చేయించారు. కాసేపు అలరించాక మరోసారి ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రారంభించారు.
ఈసారి కొబ్బరి బొండం ఇచ్చి అందులో గ్రీన్ రంగు వచ్చిన వారు సేఫ్ అని కంటెస్టెంట్లకు సూచిస్తాడు. ఆరోహీ రావుకు గ్రీన్ రంగు బొండం రావడంతో ఆమె ఈ వారం సేవ్ అయ్యిందని ప్రకటిస్తాడు. అలా హౌస్ లో ఇప్పుడు ఎలిమినేషన్ రేసులో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇనాయా సుల్తానా, అభినయలు చివరి ఎలిమినేషన్ రౌండ్ లో ఇద్దరు మిగిలారు.
ఇక ఇంటి సభ్యులను ఈ ఇద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలని కోరితే అందరూ ఇనాయా పేరే చెప్పారు. దీంతో ఆమె బెడ్ రూంలోకి వెళ్లి ఏడ్చేసింది.
బిగ్ బాస్ లో మిగిలిన ఎలిమినేషన్ కోసం గార్డెన్ ఏరియాలోకి ఇనాయా, అభినయశ్రీని పంపిచాడు నాగార్జున. అందులో రెండు భారీ సుత్తిలను పెట్టి ఆ సుత్తిలను లేపిన వారు సేఫ్. లేపని వారు ఎలిమినేట్ అయిపోతారని ప్రకటించాడు. ఈ టాస్క్ లో ఇద్దరూ సుత్తిలను లేపడంతో ఇద్దరిని సేఫ్ గా ప్రకటించాడు నాగార్జున.
ఈ వారం ఇంకా ఎవరూ సెటిల్ కాలేదని.. అందుకే ఈ వారానికి ఎవరినీ ఎలిమినేట్ చేయలేదని నాగార్జున ప్రకటించారు. ఇనాయా, అభినయశ్రీలను సేవ్ చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారని అందరూ భావించగా ఈ వారం నాగార్జున అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు.
[…] Also Read: Bigg Boss Telugu 6 Week 1 Eviction: బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్:… […]