Best Apps In 2025: ప్రస్తుతం స్మార్ట్ కాలంలో ప్రతి పని కూడా యాప్ ద్వారా జరిగిపోతోంది. అందువల్లే యాప్స్ వినియోగం విపరీతంగా ఉంటున్నది. ప్రస్తుత కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు చాలా ఎక్కువమంది ఉంటారు. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్స్ వాడాలంటే కచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ గూగుల్ ఆధీనంలో ఉంటుంది. అలాంటప్పుడు ఏ యాప్ ఎంతమంది వాడుతున్నారు? ఇలాంటి యాప్లను ఇష్టపడుతున్నారు.. అనే విషయాలను గూగుల్ లెక్కగడుతుంది. ఈ ఏడాది కూడా ఉత్తమమైన యాప్స్ గురించి గూగుల్ ప్రకటించింది.
District by Zomato
జొమాటో కంపెనీ ఈ యాప్ రూపొందించింది. ఇందులో సినిమా నుంచి మొదలుపెడితే ఈవెంట్ల వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ టేబుల్ అని కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆఫర్, డీల్స్ అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. బుక్ మై షో కు పోటీగా జొమాటో ఈ యాప్ రూపొందించింది. అనతి కాలంలోనే ఈ యాప్ విశేషమైన ఆదరణ పొందింది.
Luminar: photo editor
ఇది పూర్తిగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. ఇది ఫోటో ఎడిటింగ్ యాప్. ఒకేసారి దీనిని ఫోన్, లాప్టాప్, ట్యాబ్ వంటి వాటిలలో ఉపయోగించవచ్చు. గ్యాలరీలో ఉన్న ఈ యాప్ ను అన్ని డివైస్ లలో యాక్సిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Good notes; AI notes, Docs, PDF
మన బుర్ర పాదరసం లాగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు విపరీతమైన ఉత్సాహంతో ఉంటుంది. అలాంటప్పుడు ఐడియాలు వస్తుంటాయి. వాటిని నోట్ చేసుకోవడం కష్టం. అలాంటప్పుడు గుడ్ నోట్స్ కి యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఏకకాలంలో మొబైల్, ట్యాబ్, లాప్టాప్ లో వాడు ఎందుకు అవకాశం ఉంటుంది.
In video AI: AI video generator
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇది పనిచేస్తుంది. ఇది మనకు కావలసినట్టుగా వీడియోలను రూపొందించుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Daily planner, journal
ప్రతిరోజు నిర్వహించుకునే పనులకు మేనేజ్ చేసుకోవడానికి డైలీ ప్లానర్ విపరీతంగా ఉపయోగపడుతుంది. రిమైండర్లు, నోటిఫికేషన్లు, టెంప్లేట్స్ వంటి వాటిని ఇతర డివైస్లలో యాక్సిస్ చేసుకోవచ్చు.
Toon Sutra: webtoon, Manga app
కొంతమందికి కామెడి అంటే చాలా ఇష్టం. వెనుకటి కాలంలో కామెడీ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు మొత్తం ఫోన్ ద్వారానే అన్ని జరిగిపోతున్నాయి. అలాంటప్పుడు కామిక్ పుస్తకాలను అందరూ ఆన్లైన్లో చదువుతున్నారు. అటువంటి వారికోసం టూన్ సూత్ర అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ వంటి భాషల్లో డ్రామా, థ్రిల్లర్, ఫాంటసీ టూన్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
Sleepy soul bio: sleep, alarm
మన నిద్రను పూర్తిస్థాయిలో పరిశీలించే యాప్ ఇది. అవసరమైన అన్ని విషయాలను చెబుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా ఇది పనిచేస్తుంది. దీని ద్వారా మన నిద్రలో ఉన్న క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు.