Bigg Boss OTT Season 2: బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది..ఇక ఎండోమెల్ షైన్ సంస్థ తదుపరి కార్యాచరణ ఏంటి?, ఎప్పటి నుండో మొదలు పెట్టాలని అనుకుంటున్న బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ కనీసం ఈసారైనా మొదలు పెడుతారా?, లేదా ఈసారి కూడా వదిలేస్తారా అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. అయితే సీజన్ 4 తర్వాత TRP రేటింగ్స్ పరంగా సీజన్ 9 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతీ వారం యావరేజ్ గా 10 నుండి 12 వరకు TRP రేటింగ్స్ నమోదు అయ్యేవి. ఇండియా లోనే హైయెస్ట్ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చిన సీజన్ ఇది. మరి అలాంటి సీజన్ తర్వాత OTT సీజన్ కోసం మేకర్స్ ఆలోచించడం లో ఎలాంటి సందేహం లేదు. వచ్చే వారం ఈ విషయం పై బిగ్ బాస్ మేకర్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీటింగ్ ని నిర్వహించబోతున్నారట.
ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఓటీటీ సీజన్ ని మొదలు పెట్టాలా?, లేదా అనే నిర్ణయం తీసుకుంటారట. ఈ ఓటీటీ సీజన్ లో పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈసారి టెలివిజన్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఈ ఓటీటీ సీజన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారిలో మొదటి కంటెస్టెంట్ శ్రేష్టి వర్మ. ఈమె ‘బిగ్ బాస్ 9’ లో మొదటి వారమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. ఈమె గురించి ఆడియన్స్ పూర్తిగా తెలుసుకునే లోపే ఎలిమినేట్ అయ్యింది, మంచి టాలెంట్ ఉన్న కంటెస్టెంట్ అనే అభిప్రాయం మేకర్స్ లో ఉందట. అందుకే ఆమెకు మరో అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని టాక్. ఇక గత సీజన్ నుండి ఓటీటీ సీజన్ లోకి తీసుకోవాలని చూస్తున్న రెండవ కంటెస్టెంట్ ప్రియా శెట్టి. అగ్నిపరీక్ష షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్స్ క్యాటగిరీ లో అడుగుపెట్టిన ఈమె మూడవ వారం ఎలిమినేట్ అయ్యింది.
ఈమె కూడా మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి, బ్యాడ్ లక్ వల్ల ఎలిమినేట్ అయ్యింది అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది, అదే విధంగా మేకర్స్ లో కూడా ఉంది. కాబట్టి ఈమె కూడా ఓటీటీ సీజన్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ ని ఫిబ్రవరి నెలలో మొదలు పెట్టాలని చూస్తున్నారట. ఇకపోతే సీజన్ 10 కోసం ‘అగ్నిపరీక్ష 2’ ని మే నెలలోనే నిర్వహించబోతున్నారట. సామాన్యుల క్యాటగిరీలో ఈ అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన 7 మంది కంటెస్టెంట్స్ లో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలిస్తే, మరొకరు టాప్ 3 లో నిలిచారు. కాబట్టి సీజన్ 2 కి క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండదని అంటున్నారు. ఈసారి అప్లికేషన్స్ లక్షల్లో ఉండొచ్చు.