Homeజాతీయ వార్తలుBengal Panchayat Elections 2023: పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు.. టీఎంసీ దున్నేసింది.. బీజేపీ కొట్టుకుపోయింది..

Bengal Panchayat Elections 2023: పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికలు.. టీఎంసీ దున్నేసింది.. బీజేపీ కొట్టుకుపోయింది..

Bengal Panchayat Elections 2023: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార తణమూల్‌ కాంగ్రెస్‌ మరియు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి అగ్ని పరీక్షగా భావించే పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మంగళవారం కౌంటింగ్‌ మొదలై ఫలితాలు ప్రకటిస్తున్నారు. కేంద్ర బలగాలు మరియు రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టాప్‌ 10 అప్‌డేట్‌లు

– మంగళవారం రాత్రి 10.30 గంటల వరకు 1,540 స్థానాల్లో ఆధిక్యంతోపాటు 28,985 గ్రామ పంచాయతీ స్థానాలను టీఎంసీ గెలుచుకుంది. బీజేపీ 7,764 సీట్లు గెలుచుకుంది, 417 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

– లెఫ్ట్‌ ఫ్రంట్‌ 2,468 సీట్లు గెలుచుకుంది. అందులో సీపీఐ(ఎం) ఒంటరిగా 2,409 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం వామపక్షాలు 260 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ 2,022 స్థానాల్లో విజయం సాధించి 139 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతర పార్టీలు 725 స్థానాల్లో గెలిచి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఎంసీ రెబల్స్‌తో కూడిన స్వతంత్రులు 1,656 స్థానాల్లో గెలిచి 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

హింసపై నిజనిర్ధారణ కమిటీ..
ఇక పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీ కూడా నలుగురు సభ్యులతో మరో నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఇందులో ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, ఎంపీ డాక్టర్‌ సత్యపాల్‌ సింగ్‌ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకు 45 మంది మరణించారని తెలిపింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మంగళవారం మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన 133 మంది రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల హింసాకాండ కారణంగా తమ ప్రాణాలకు భయపడి ఆశ్రయం పొందారన్నారు. ప్రజలకు సహాయక శిబిరంలో ఆశ్రయం కల్పించామని పేర్కొన్నారు. ‘సంక్షోభ సమయంలో ఏదైనా మానవతా సహాయం’ అందిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.

గవర్నర్‌ పర్యటన..
ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ.ఆనంద బోస్‌ దక్షిణ 24 పరగణాల జిల్లా, భాంగర్‌ మరియు కానింగ్‌లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాకాండపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సోమవారం సమావేశమయ్యారు. నివేదిక అందించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular