Telangana DGP Anjani Kumar: పెరుగు ప్యాకెట్ కోసం ఓ లోకోపైలెట్ ఏకంగా రైలును మధ్యలో ఆపేసిన ఘటన గురించి విన్నాం. కచోరీ తినాలనిపించి రైలు ఆపేసిన లోకో పైలెట్ గురించి విన్నాం. కానీ హైదరాబాద్‌లో ఓ అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం అందరికి కోపం తెప్పించే విధంగా ఉంది. కుయ్.. కుయ్.. కుయ్.. సైరన్ వేసుకుని ఓ అంబులెన్స్ వేగంగా దూసుకువస్తోంది. అప్పుడే ఆ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అందులో పేషెంట్ కండీషన్ ఎలా ఉందో అని వాహనదారులు కూడా అడ్డు తప్పుకున్నారు.. ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్ సిగ్నల్ దాటింది. తర్వాత వాహనాలు వెళ్లిపోయాయి. అయితే సిగ్నల్ దాటిన అంబులెన్స్ డ్రైవర్ చేసిన పని చూసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. సైరన్‌తో వేగంగా ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ తర్వాత కాస్త దూరంలో రోడ్డు పక్కన బజ్జీలు తింటూ కనిపించాడు. కేవలం బజ్జీల కోసమే ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసేందుకు సైరన్ వేశాడని మండిపడుతున్నాడు. ఇంత కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేసిన ట్రాఫిక్ పోలీసులకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చాడు ఆ అంబులెన్స్ డ్రైవర్.
ట్రాఫిక్ నుంచి బయటకు రాగానే..
వేగంగా దూసుకెళ్లిన అంబులెన్స్ ట్రాఫిక్ నుంచి బయటకు రాగానే.. దగ్గర్లో ఉన్న మిర్చి బండి వద్ద అంబులెన్స్ ఆపి తీరిగ్గా.. మిర్చి బజ్జీలు, కూల్‌డ్రింక్స్ ఆరగించాడు. ఇదేంటి.. ఎంతో ఎమర్జెన్సీతో వచ్చిన అంబులెన్స్ ఇలా మిర్చి బజ్జీల బండి దగ్గర ఆగిందని అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు తీరా అక్కడికి వెళ్లి చూడగా.. ఎంచక్కా అంబులెన్స్ డ్రైవర్‌తోపాటు సిబ్బంది మిర్జీబజ్జీలు తింటున్నారు. దీంతో చిరెత్తుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రశ్నించగా.. కుంటిసాకు చెప్పాడు. దీంతో దీనికి సంబంధించిన మొత్తం తతంగాన్ని వీడియో తీసి పై అధికారులకు పంపించారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డీజీపీ..
దీనిపై స్పందించిన డీజీపీ అంజనీ కుమార్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటేనే సైరన్ వినియోగించాలని, అంబులెన్స్ సైరన్ ఇష్టం వచ్చినట్లు వాడితే కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అంత ఆకలైతే.. కాస్త ఆగి తొన్చుగా.. సైర్ వేసి కంగారు పెట్టడం ఎందుకు.. ఇంత కరువులో ఉన్నావేంట్రా.. ఇలాంటి వాళ్లకు భారీగా ఫైన్ వేయాలి.. మా దగ్గర కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
#TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised.
Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN
— Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The police cleared the traffic after hearing the ambulance siren do you know what happened after that shocking video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com