Chiranjeevi Acharya: నిన్న నైట్ ‘ఆచార్య’ సినిమా ప్రివ్యూ వేశారని.. ఈ సందర్భంగా చిరు అతిధులకు చిన్న పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో ముందు నుంచి పార్టీ కల్చర్ ను ప్రవేశ పెట్టింది చిరంజివినే. పైగా దర్శకుల మధ్య మంచి అవగాహనను పెంచింది కూడా చిరునే. అలాగే నటీనటుల మధ్య బంధాలను గట్టిపడేలా చేసింది కూడా చిరంజీవినే. మెగాస్టార్ ఇచ్చే పార్టీల కారణంగా ఒకరితో ఒకరు మంచి స్నేహంగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది.

Chiranjeevi Acharya
నేటి జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఆ ఆనవాయితీని అలా కంటిన్యూ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రెజెంట్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా నిన్న చిరు ఇచ్చిన పార్టీలో ఒకచోట చేరి సంతోషంగా గడిపారు. మరి టాప్ డైరెక్టర్స్ అంతా ఒక చోట చేరితే ఆ ఎంజాయ్ మెంట్ వేరు. ఆ సందడే వేరు. పైగా ప్రముఖ దర్శకులంతా కలిసినప్పుడు చాలా ముచ్చట్లు ఉంటాయి. కానీ ఈ సారి ముచ్చట్లు ఏమి లేవు. ఆచార్య సినిమా పై తమ అభిప్రాయాలు చెప్పారు.
Also Read: Mahesh Babu In Dubai: దుబాయి కి మహేష్ బాబు తో వెళ్లిన రాజమౌళి.. అభిమానులకు పూనకాలు రప్పించే వార్త
అలాగే మెగాస్టార్ తో ఎవరు ఎలాంటి సినిమా చేస్తారనే ఆలోచన పై ప్రతి ఒక్కరు ఒక్కో స్పీచ్ ఇచ్చారు. అదే విధంగా భవిష్యత్తు సినీ తరం గురించి కూడా ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఒక కొత్త కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసం దర్శకులంతా ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ పెట్టాలని నిర్ణయించుకున్నారట.
ఇంతకీ ఈ దర్శకులంతా ఎలాంటి ప్లాట్ ఫామ్ పెట్టబోతున్నారు ?, దీని వల్ల ఎవరికీ ఉపయోగం ఉంటుంది ? లాంటి విషయాల పై చర్చ కూడా జరిపారు.
ఏది ఏమైనా ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ టాప్ దర్శకులంతా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పైగా ఈ వేడుకను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో అందరిలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది.

Chiranjeevi Acharya
ఇంతకీ ఈ ఆచార్య వేడుకల్లో పాల్గొన్న డైరెక్టర్స్ లిస్ట్ లో కొరటాల శివ, పరశురామ్, సుకుమార్, బోయపాటి శ్రీను, మెహర్ రమేశ్ ఉన్నారు. అలాగే నిర్మాత దిల్ రాజు అలాగే ఆయన భార్య, మరో నిర్మాత అల్లు అరవింద్, నటుడు సోనూసూద్ కూడా ఈ ఆచార్య పార్టీకి హాజరయ్యారు.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ ఇవే !
Recommended Videos: