గ్రెటర్ ఎన్నికల నేపథ్యంలో బీసీల ఓట్లు కీలకం కానున్నాయి. అందుకే బీసీలకు దగ్గరయ్యేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి . ఈ ఎన్నికల్లో బీసీల ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. నగరం మొత్తంలో 150 డివిజన్లు ఉండగా, దాదాపు 60, 70 డివిజన్లలో బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు.
Also Read: ఎంఐఎం చరిత్ర ఏంటి? జాతీయ పార్టీగా ఎలా ఎదిగింది?
టికెట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించగా, పలు రాజకీయ పార్టీలు 50 శాతానికి మించి స్థానాలను కేటాయించినట్లు తెలుస్తోంది. పలుచోట్ల జనరల్ స్థానాల్లో సైతం బీసీలకు టికెట్లు ఇచ్చాయి. టీఆర్‌ఎస్ సగానికి సగం సీట్లు బీసీలకు ఇవ్వగా.. బీజేపీ అంతకుమించి ఇచ్చింది. బీసీ కులాల్లోనూ యాదవ, గౌడ, మున్నూరు కాపు కులాలకే అగ్రతాంబూలం దక్కినట్లు తెలుస్తోంది.
విశ్వకర్మ, పెరిక, నాయీ బ్రహ్మణ, మార్వాడీ, రజక, లోథీ, గంగపుత్ర, చౌదరి కులాలకు రెండు నుంచి నాలుగు టికెట్లు కేటాయించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 74.04 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 18 లక్షలకుపైగా బీసీలే ఉన్నట్లు తెలుస్తోంది. గోషామహల్, ఖైరతాబాద్, కార్వాన్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో బీసీల ప్రాబల్యం అధికంగా ఉన్నట్లు సమాచారం. ఆయా సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో బీసీలు ఏవైపు మొగ్గు చూపుతారో వారే విజేతలుగా నిలువనున్నారు. పటాన్‌చెరు సర్కిల్‌లో మూడు డివిజన్లు ఉండగా, వాటిలో బీసీలకే ఎక్కువ ప్రాబల్యం ఉంది. ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి సర్కిళ్లలోనూ బీసీ ఓటర్లే అధికం. దీంతో అన్ని రాజకీయం పార్టీ లు బీసీలు అనేక హామీలు ఇస్తున్నారు.
Also Read: గ్రేటర్ ఎన్నికలు.. ఆ నేతలకు కలిసి వచ్చాయా?
మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో బ్రాహ్మణుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గోషామహల్ నియోజక వర్గంలోని బేగంబజార్, రాంకోఠి ప్రాంతాల్లో వ్యాపారం చేసే మార్వాడీలు, గుజరాతీలు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కమ్మ, కాపుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. బీసీ వ్యూహంతో ఎలాగైనా గ్రేటర్ దక్కించుకోవాలని టీఆర్ఎస్ , బీజీపీ ప్రయత్నలు చేస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్