ఆ సీరియల్ హీరో దారుణంగా ఏడిపిస్తాడట !

కరోనా పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో పాటు సీరియల్స్ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. వాటిల్లో కార్తీకదీపం అనే సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి, అందులోని పాత్రల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవ్వరూ ఉండరట. అంతగా ఈ సీరియల్ కి టీఆర్పీ రేటింగ్ వస్తోంది. పైగా కార్తీకదీపంలో సీరియల్‌లోని అన్ని పాత్రలు ఓ రేంజ్‌లో క్లిక్కయ్యాయి. మరీ ముఖ్యంగా కార్తీక్ ‘డాక్టర్ బాబు’గా నిరుపమ్.. వంటలక్క దీపగా ప్రేమీ విశ్వనాథ్‌లకు […]

Written By: admin, Updated On : November 22, 2020 4:02 pm
Follow us on


కరోనా పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో పాటు సీరియల్స్ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. వాటిల్లో కార్తీకదీపం అనే సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి, అందులోని పాత్రల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవ్వరూ ఉండరట. అంతగా ఈ సీరియల్ కి టీఆర్పీ రేటింగ్ వస్తోంది. పైగా కార్తీకదీపంలో సీరియల్‌లోని అన్ని పాత్రలు ఓ రేంజ్‌లో క్లిక్కయ్యాయి. మరీ ముఖ్యంగా కార్తీక్ ‘డాక్టర్ బాబు’గా నిరుపమ్.. వంటలక్క దీపగా ప్రేమీ విశ్వనాథ్‌లకు తిరుగులేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది ఈ సీరియల్. వీరి పాత్రలు తరువాత హిమ, శౌర్య పాత్రలకు కూడా మంచి పేరు వచ్చింది.

Also Read: ఎట్టకేలకు కియారా కోరిక తీరబోతుంది !

ఆ క్యారెక్టర్స్ పోషిస్తోన్న బాల నటులు కృతిక, సహృదలకు కూడా ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. దీనికితోడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌లు సోషల్ మీడియాలో చేసే రచ్చ కూడా మామూలుగా ఉండదు. శౌర్య ఫేమ్ కృతిక.. తెరపై గంభీరంగా కనిపిస్తుంది.. కానీ రియల్ లైఫ్‌లో సాఫ్ట్‌గా కనిపిస్తూ.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక హిమ పాత్రలో సహ‌ృద తెరపై చాలా అమాయకంగా కనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఈ పాప తెగ హుషారు పిల్ల. ఈ పాప వేసే డ్యాన్సులు చేసే అల్లరి మామూలుగా ఉండవు. అందుకే షూటింగ్ గ్యాప్‌లో డాక్టర్ బాబు హిమను దారుణంగా ఏడిపిస్తాడట.

Also Read: పెళ్లికి రెడీ అంటున్నా.. బుల్లితెర రాములమ్మ

కాగా నిరుపమ్ తెర వెనుకలా ఎంత సరదాగా ఉంటాడో తాజాగా చెప్పుకొచ్చింది. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ భార్య మలయజ ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి.. ఇంటర్వ్యూలు చేస్తోంది. ఈ క్రమంలో నిరుపమ్, సహృదలను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సహృద ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. మొదటగా నిరుపమ్‌ను అన్నయ్య అని పిలిచేదట. కానీ ఆ తరువాత అంకుల్ అని పిలవాలని అనిపించిందని.. అందుకే అలాగే పిలుస్తున్నానని చెప్పింది. ఇక షూటింగ్ గ్యాప్‌లో తనను బాగా ఏడిపిస్తాడని, కోతి అంటూ పిలుస్తాడని నిరుపమ్ గురించి సహృద కంప్లైంట్ చేసింది. మరి డాక్టర్ బాబు ఇక నుండైనా ఏడిపించకుండా ఉంటాడేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్