Barack Obama : బరాక్ ఒబామా.. అమెరికా దేశానికి 2008 నుంచి 2016 వరకు అధ్యక్షుడిగా పని చేశారు. అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన తొలి నల్లజాతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 44వ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి ప్రపంచ మన్ననలు పొందారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసిన ఒబామా.. రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.. వివాద రహితుడిగా పేరుగాంచిన ఆయన ప్రస్తుతం ఒబామా ఫౌండేషన్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. భార్య మిషెల్లీ ఒబామాతో కలిసి చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. బరాక్ ఒబామాకు మాలియా, సాషా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. పెద్ద కూతురైన మాలియా .. తండ్రి లాగా రాజకీయాల్లోకి రాకుండా సినిమా రంగాన్ని ఎంచుకుంది. హాలీవుడ్లో చిత్ర నిర్మాతగా అరంగేట్రం చేసింది. వర్థమాన దర్శకుడితో ” దీ హార్ట్” షార్ట్ ఫిలిం రూపొందించింది. ఈ షార్ట్ ఫిలిం కు సంబంధించి ప్రీమియర్ షోను జనవరి 18న అమెరికాలోని ఉటాలో పార్క్ సిటీ ప్రాస్పెక్టర్ స్క్వేర్ థియేటర్లో ప్రదర్శించారు.
25 సంవత్సరాల మాలియా హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసింది.. తను నిర్మించిన ది హార్ట్ అనే సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో ప్రసారం చేసిన నేపథ్యంలో.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రచార చిత్రాలపై తన పేరు చివర ఒబామాకు బదులు మాలియా ఆన్ అని ఉండటంతో అమెరికా వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సన్ డాన్స్ ఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో మాలియా నిర్మించిన ది హార్ట్ షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో ప్రసారం.. అనంతరం నిర్వహించిన మీట్ దీ ఆర్టిస్ట్ స్పాట్లైట్ వీడియోలో కూడా మాలియా ఒబామాకు బదులు మాలియా ఆన్ అని ఉండడం విశేషం.
అమెరికా చట్టాల ప్రకారం యుక్త వయసుకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులతో దూరంగా ఉంటారు. వారికి వ్యక్తిగతంగా స్వేచ్ఛ కూడా ఉంటుంది. మాలియా కూడా ఆ మధ్య ఓ యువకుడితో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె గర్భవతి అనే పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే అప్పట్లో ఆమె పేరును అమెరికా మీడియా మాలియా ఒబామా అనే పేర్కొనేది. మాలియా నిర్మించిన షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో సందర్భంగా ఆమె పేరుని మాలియా ఆన్ అని సంబోధించడం సరికొత్త చర్చకు దారితీస్తోంది.
హాలీవుడ్లో కెరియర్ కోసం మాలియా తన ఇంటిపేరు మార్చుకుంది అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. తాను నిర్మించిన షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో సందర్భంగా తన పేరును మాలియా ఆన్ అని పిలిచినప్పుడు పెద్దగా స్పందించలేదు. తన పూర్వపు పేరులో మార్పు తనకు ఇష్టమే అన్నట్టుగా మాలియా సంకేతాలు ఇచ్చిందని అమెరికన్ ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. కాగా సినిమా కెరియర్ కోసం ఇంటిపేరు మార్చుకోవడం ఏంటని విమర్శిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు.
మాలియా రూపొందించిన ది హార్ట్ అనే షార్ట్ ఫిలిం ఒక తల్లి, కొడుకు చుట్టూ తిరుగుతుంది. ఈ షార్ట్ ఫిలింలో టుండే అడె బింపే, లాటోన్యా బోర్సే, జాన్ వీగాండ్ పాత్రలు పోషించారు. ” ఇది ఒక విచిత్రమైన చిన్న కథ. కల్పిత కథ. ఒక వ్యక్తి తన తల్లి ఇష్టానుసారం అసాధారణమైన అభ్యర్థనను విడిచిపెట్టిన తర్వాత.. ఆమె మరణిస్తుంది.. ఆమె మరణం గురించి దుఃఖిస్తాడు. అలా ఎందుకు జరిగిందనేదే ఈ షార్ట్ ఫిలిం ముఖ్య కథ అని” మాలియా ప్రకటించింది. మాలియా హాలీవుడ్ లోకి అరంగేట్రం ముందు హెచ్ బీ వో ఛానల్ లో ప్రసారమయ్యే డ్రామా సీరియస్ గర్ల్స్ ను నిర్మించిన హార్వే వైన్ స్టెయిన్ అనే నిర్మాణ సంస్థలో శిక్షణ పొందింది. అమెజాన్ ప్రైమ్ సిరీస్ లో స్ట్రీమ్ అవుతున్న డోనాల్డ్ గ్లోబల్ స్వార్మ్ చిత్రానికి సంబంధించి మాలియా స్టాఫ్ రైటర్ గా పని చేసింది.
బరాక్ ఒబామా కూతురైన మాలియా ఒక్కసారిగా తన పేరు ఎందుకు మార్చుకుంది? ఇంట్లో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అందువల్లే తను సినీ రంగ ప్రవేశం చేసిందా? తన పేరు మార్పును కూడా ఆమె ఎందుకు స్వాగతిస్తోంది? దీనిపై బరాక్ ఒబమా స్పందన ఏంటి? అనేక ప్రశ్నల చుట్టూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఫైనల్ గా తన పేరు ఎందుకు మార్చుకుందో మాలియా చెప్పేదాకా ఈ ప్రశ్నల పరంపర.. చర్చల పరంపర ఆగదు.