https://oktelugu.com/

Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ?

Mahesh- Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా బడ్జెట్‌ పై సోషల్‌ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మించిన బడ్జెట్‌తో, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలతో మహేశ్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడట ‘ఆర్ఆర్ఆర్’ హడావుడి మరో రెండు వారాల్లో ముగిసిపోతుంది కాబట్టి.. మహేష్ ఫ్యాన్స్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 30, 2022 / 06:53 PM IST
    Follow us on

    Mahesh- Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా బడ్జెట్‌ పై సోషల్‌ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మించిన బడ్జెట్‌తో, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలతో మహేశ్‌ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడట

    Mahesh- Rajamouli Movie

    ‘ఆర్ఆర్ఆర్’ హడావుడి మరో రెండు వారాల్లో ముగిసిపోతుంది కాబట్టి.. మహేష్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి అయితే మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందట. కాకపోతే, రాజమౌళి పూర్తి అయిన స్క్రిప్ట్ పై కూడా వర్క్ చేయడానికి ఆరు నెలలు టైం తీసుకుంటాడు. ఆ తర్వాత మహేష్ బాబు ఎప్పుడు డేట్స్ ఇవ్వగలడో తెలుసుకొని అప్పుడు సినిమా షూట్ ను ప్లాన్ చేస్తాడట.

    Also Read: Pakka Commercial Release Date Fixed: జులై 1న గోపీచంద్ నిలబడగలడా ?

    కాబట్టి.. ఇదంతా సెట్ కావాలంటే మరో ఏడాది అయినా పడుతుంది అంటున్నారు సినీ జనం. అందుకే, రాజమౌళి తన కెమెరామన్ సెంథిల్ ని వేరే సినిమా చేసుకోమని సలహా ఇచ్చాడు. ప్రస్తుతం సెంథిల్ ఒక కన్నడ – తెలుగు చిత్రాన్ని టేకప్ చేశాడు. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు హీరోగా వస్తున్న సినిమాకి సెంథిలే కెమెరామెన్. ఎలాగూ మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి మరో ఏడాది సమయం ఉంది కాబట్టి.. ఈ లోపు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు సినిమాను పూర్తి చేస్తాడట సెంథిల్.

    Rajamouli-Mahesh Babu

    ఆ తర్వాత మహేష్ – రాజమౌళి సినిమా మీదకు రానున్నాడు. మొత్తమ్మీద మహేష్ – రాజమౌళి సినిమా కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఇక మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా కథను ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో రాశారని.. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుందని గతంలో వార్తలు వినిపించాయి. ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారట.

    ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి మహా దిట్ట. పైగా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం కూడా. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు.

    Also Read: NTR Koratala Siva Movie: ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే

    Tags